స్థానిక సమస్యల పరిష్కారం, మౌలిక వసతుల కల్పనే ధ్యేయంగా వివిధ అభివృద్ధి పనులు
వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య ముదిరాజ్ : స్థానిక సమస్యల పరిష్కారం, మౌలిక వసతుల కల్పనే ధ్యేయంగా వివిధ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టినట్లు మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. జల్ పల్లి సర్కిల్, జీహెచ్ఎంసీ 63వ డివిజన్ పరిధిలోని షాహీనగర్, కొత్తపేట్, నబీల్ కాలనీ, కొత్తపేట్ వాటర్ ట్యాంక్ ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న వర్షపు నీరు, డ్రైనేజ్, రోడ్లు, తాగునీటి సమస్యల పరిష్కారం కోసం...