MANA TOLIVELUGU
Newspaper Banner
Date of Publish : 27 May 2026, 5:37 pm Posted by : MANA TOLIVELUGU

104 ఫార్మసిస్టులు ల్యాబ్ టెక్నీషియన్లకు వేతనాలు చెల్లించాలి 

మన తొలివెలుగు, నాగర్ కర్నూల్ ప్రతినిధి విజయ్ కాంత్ 

ఆరోగ్య శాఖలో 104 నిర్దిష్ట దిన ఆరోగ్య వైద్య సేవలు పథకం కింద పని చేస్తున్న ఫార్మసిస్టులు, ల్యాబ్ టెక్నీషియన్లకు గత 12 నెలల నుండి రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య సిబ్బందికి వేతనాలు చెల్లించడం లేదని, త్వరగా వేతనాలు చెల్లించాలని ప్రభుత్వ సాధారణ ఆసుపత్రి రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అజీమ్ కి ఆరోగ్య సిబ్బంది బుధవారం వినతి పత్రం అందజేశారు. పెరుగుతున్న ధరలకు అనుకూలంగా గత 12 నెలలగా కాలం నుండి వేతనాలు లేక 104 సిబ్బంది కుటుంబ పోషణ, తీవ్రమైన ఆర్థిక భారం పడుతుందని, ప్రభుత్వం వెంటనే స్పందించి 104 ఆరోగ్య సిబ్బంది కుటుంబాలను ఆదుకోవాలని వినతిపత్రంలో కోరారు. గత 18 సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వం సూచించిన విధులను సక్రమంగా నిర్వహిస్తూ ఉన్నామని, కరోనా సమయంలో 104 సిబ్బంది యొక్క సేవలను విశిష్టంగా వినియోగించామని అన్నారు. కరోనా సమయంలో ప్రాణాపాస్థితిలో రోగులకు మరియు ప్రస్తుతం రోగులకు విశేష సేవలు అందించి రాష్ట్ర ప్రభుత్వం సూచించిన నిర్దిష్ట సేవలను కొనసాగిస్తున్న వేతనాలు చెల్లించకపోవడం తీవ్రమైన ఆవేదనకు గురి చేసినట్లు వారు తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే వేతనాలు చెల్లించి కుటుంబాలను ఆదుకోవాలని వారు కోరారు.గత 4 నెలలుగా ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిలో రోగులకు సేవలు అందిస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో 104 ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్ల సంఘం జిల్లా అధ్యక్షులు కే.రమేష్, ప్రధాన కార్యదర్శి చంద్రమౌళి, సభ్యులు వై. వినోద్ కుమార్, యాదగిరి, గోవర్ధన్, శ్రీనివాసులు, మహేందర్ నాథ్, సురేష్, రాజశేఖర్, సువర్ణ తదితరులు పాల్గొన్నారు.