మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య ముదిరాజ్ :
ఫ్యూచర్ సిటీలో 10న జరిగే సీఎం బహిరంగ సభకు వేలాదిగా తరలివెళ్ళి విజయవంతం చేద్దామని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గుడ్ల శ్రీనివాస్ మహారాజ్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం కందుకూరు మండలం లో ఫ్యూచర్ సీటీ డెవలప్ పనులను, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభ పరిశీల కోసం విచ్చేసిన ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబుని, కేఎల్ఆర్ ని గుడ్ల శ్రీనివాస్ మహారాజ్ , పుట్టగాళ్ల జగన్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ శివగళ్ల యాదయ్య, గణేష్ తదితరులతో కలిసి ఘనంగా సన్మానం చేసి స్వాగతం పలికారు. 10న జరగబోయే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సభ కు ప్రజలు అత్యధిక సంఖ్యలో తరలి వచ్చి సభను విజయవంతం చేయాలని గుడ్ల శ్రీనివాస్ మహారాజ్ కోరారు.