ప్రముఖ నేత్ర వైద్యుడు డా.గౌతమ్ రాజు విజయవంతమైన చికిత్స
మన తొలివెలుగు, నాగర్ కర్నూల్ బ్యూరో ప్రతినిధి విజయ కాంత్
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రానికి సంబంధించిన 93 ఏళ్ల వృద్ధుడు భూదానం సుబ్బారావుకు ప్రముఖ నేత్ర వైద్యులు డా. గౌతమ్ రాజు విజయవంతంగా నేత్ర చికిత్స నిర్వహించి చూపును మెరుగుపరిచారు. రేటినా సమస్యతో పాటు క్యాటారాక్ట్ ఆపరేషన్‌ను సమర్థవంతంగా పూర్తి చేయడంతో వృద్ధుడికి తిరిగి స్పష్టమైన చూపు లభించిందన్నారు. నాగర్ కర్నూల్ వాస్తవ్యులు, జిల్లా ఇన్చార్జి డీజీఓ వాసవి శ్రీధర్ కుమారుడిగా గుర్తింపు పొందిన డా. గౌతమ్ రాజు ఆధ్వర్యంలో ఈ చికిత్స జరిగిందన్నారు. అధిక వయస్సు ఉన్నప్పటికీ జాగ్రత్తగా వైద్య పరీక్షలు నిర్వహించి ఆపరేషన్ చేయడం విశేషంగా నిలిచింది. చికిత్స అనంతరం భూదానం సుబ్బారావు ఆరోగ్యంగా ఉండటంతో కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ వయస్సులో మళ్లీ చూపు రావడం ఎంతో సంతోషంగా ఉంది.. అంటూ కుటుంబ సభ్యులు భావోద్వేగానికి గురయ్యారు. డా.గౌతమ్ రాజు అందించిన వైద్య సేవలకు భూదానం కుటుంబ సభ్యులు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలకు అంకితభావంతో వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్‌ను పలువురు అభినందిస్తున్నారు.