ePaper
Monday, August 3, 2026
📄 ePaper
Homeమహేశ్వరంకాంగ్రెస్ పార్టీ పటిష్టతకు బీఎల్ఏలే కీలకం

కాంగ్రెస్ పార్టీ పటిష్టతకు బీఎల్ఏలే కీలకం

📰 Generate e-Paper Clip

సర్ కు ప్రజలు సహకరించాలి

మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య ముదిరాజ్  :

కాంగ్రెస్ పార్టీ పటిష్టతకు బీఎల్ఏలే కీలకమనీ కందుకూరు మండలం మాజీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు లేమూర్ గ్రామ బీఎల్ఏ డిల్లీ శ్రీధర్ ముదిరాజ్ అన్నారు. భారత ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక సమగ్ర ఓటర్ల ప్రక్షాళన కార్యక్రమంలో భాగంగా కందుకూరు మండలం పరిధిలోని లేమూర్ గ్రామంలో 538, 539, 540 పోలింగ్ బూత్‌ల వద్ద నిర్వహించిన సర్ ప్రోగ్రాం లో ఆయన బీఎల్ఓల ఇంచార్జి గ్రామ జీపీఓ నాగరాజు బీఎల్ఓలు గుల్వి శ్రీలక్ష్మి, కటికెల రాణి, ఢిల్లీ శైలజతో పాటు సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మంచాల భాస్కర్, గుల్వి దేవేందర్, వార్డు మెంబర్ మంచాల లక్ష్మయ్య, సూరసాని యాదగిరి రెడ్డి, ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ డప్పు పోచయ్య చిన్నగాళ్ల రవీందర్, జంగిలి బన్నీ, సూరసాని అంజిరెడ్డి తో కలిసి పాల్గొన్నారు. మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కేఎల్ఆర్ ఆదేశాల మేరకు ఎన్యూమరేషన్ దరఖాస్తులను పంపిణీ చేశారు. ఈ సందర్బంగా డిల్లీ శ్రీధర్ మాట్లాడుతూ.. ఓటరు జాబితా పటిష్టీకరణ, ప్రతి అర్హుడైన ఓటరికి న్యాయం జరగడం, ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడం తమ లక్ష్యమన్నారు. బూత్ స్థాయి నుండి పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేస్తూ ప్రతి ఓటర్ హక్కును కాపాడేందుకు కట్టుబడి ఉన్నామన్నారు. బలమైన బూత్ నిర్మాణమే బలమైన విజయానికి పునాది అని తెలిపారు. ప్రతి అర్హుడైన ఓటర్ ను ఓటరు జాబితాలో నమోదు చేయించాలని ఆయన కోరారు. డూప్లికేట్, మల్టీ ఫుల్ మరణించిన వారు బోగస్ ఓటర్లను గుర్తించి ఓటర్ల జాబితాలను తొలగించేలా చూడాలని ఆయన పేర్కొన్నారు. రాబోయే ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని ఓటర్ సవరణ పై ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని కస్టపడి పని చేయాలని సూచించారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!