ePaper
Wednesday, September 16, 2026
📄 ePaper
Homeయాదాద్రి భువనగిరి జిల్లాఘనంగా కేటీఆర్ పుట్టినరోజు వేడుకలు

ఘనంగా కేటీఆర్ పుట్టినరోజు వేడుకలు

📰 Generate e-Paper Clip

మన తొలివెలుగు, మోత్కూర్ ప్రతినిధి పబ్బు ప్రవీణ్ :

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు జన్మదిన వేడుకలను మోత్కూర్ పట్టణంలో శుక్రవారం పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. స్థానిక మహాత్మ జ్యోతిరావు పూలే చౌరస్తా వద్ద పార్టీ మండల అధ్యక్షుడు పోన్నెబోయిన రమేష్, పట్టణ అధ్యక్షుడు జంగ శ్రీను కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంచారు.ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ నేతలు మాట్లాడుతూ.. రాష్ట్ర పారిశ్రామిక, ఐటీ రంగాల ప్రగతికి కేటీఆర్ అందించిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఆయన నిండు నూరేళ్లు ఆరోగ్యంగా జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కొణతం యాకుబ్ రెడ్డి, మాజీ రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు కొండ సోంమల్లు, జిల్లా నాయకుడు మర్రి అనిల్ కుమార్, మున్సిపల్ ప్రధాన కార్యదర్శి గజ్జి మల్లేష్, నాయకులు తీపిరెడ్డి మేఘరెడ్డి, సత్యం గౌడ్, గిరగని శ్రీను, దాసరి తిరుమలేష్, దబ్బటి శైలజ, కూరెళ్ల పరమేష్, పానుగుల్ల విష్ణుమూర్తి, పురుగుల మల్లయ్య, సామ పద్మారెడ్డి, కోక బిక్షం, అన్నందాస్ విద్యాసాగర్, మంచే గోవర్ధన్, మల్లం అనిత, కట్ట ఇంద్రజ్యోతి, చెడిపల్లి రఘుపతి,పబ్బు ప్రవీణ్, జంగ శివ, గనగాని రాజేష్, పోన్నెబోయిన మచ్చగిరి, బందెల శ్రీను, కూరెళ్ల రమేష్, మొరిగాల శీను, మరిగాల వెంకన్న, మలిపెద్ద మల్లారెడ్డి, కల్వల శోభన్, దండ్ల కళ్యాణ్, కొంపెల్లి మల్లేష్, పంజాల మహేందర్, దండ్ల కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!