మన తొలివెలుగు జోగులాంబ గద్వాల జిల్లా రిపోర్టర్ గడ్డం సుధాకర్ :
జోగులాంబ గద్వాల జిల్లా, గద్వాల పట్టణంలోని ఆర్యన్ ద స్కూల్ లో 80వ స్వాతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్కూల్ కరస్పాండెంట్ లక్ష్మణ్ విద్యార్థుల తో కలిసి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. చిన్నారులు జాతీయ జెండాను చేతబట్టి భరతమాత వేషధారణ ప్రదర్శన ఆకర్షణగా నిలిచింది. విద్యార్థుల ప్రతిభను కరస్పాండెంట్ లక్ష్మణ్, ప్రిన్సిపల్ శ్రీనివాస్ అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్యార్థుల క్రమశిక్షణ, దేశభక్తి, నిజాయితీతో బాధ్యతాయుతంగా ముందుకు వెళ్లాలని, దేశం గర్వించదగ్గ పౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో స్కూలు ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.


