ePaper
Friday, October 16, 2026
📄 ePaper
Homeతెలంగాణఎల్బీనగర్‌లో ‘దసరా అలయ్ బలయ్’ పోస్టర్ ఆవిష్కరణ

ఎల్బీనగర్‌లో ‘దసరా అలయ్ బలయ్’ పోస్టర్ ఆవిష్కరణ

📰 Generate e-Paper Clip

ఈనెల 25న తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనం

సంప్రదాయ నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలకు ఏర్పాట్లు 

తెలంగాణ ఉద్యమకారులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయండి

కాచం సత్యనారాయణ పిలుపు

మన తొలివెలుగు | తెలంగాణ బ్యూరో:

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించనున్న ‘దసరా అలయ్ బలయ్ – తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనం’ పోస్టర్‌ను శుక్రవారం ఎల్బీనగర్ లోని మలిదశ తెలంగాణ ఉద్యమ తొలి అమరుడు శ్రీకాంతాచారి విగ్రహం వద్ద తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం అధ్యక్షులు, వీ3 న్యూస్ ఛానల్, ప్రజా విశ్వంభరా దినపత్రిక చైర్మన్ కాచం సత్యనారాయణ ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమకారులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కాచం సత్యనారాయణ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారుల మధ్య ఆత్మీయతను పెంపొందించడం, వారి సేవలను గుర్తించి గౌరవించడం, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని భావితరాలకు చాటిచెప్పడం ఈ సమ్మేళనం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ఈ నెల 25వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటల నుంచి నాగోల్‌లోని శుభం కన్వెన్షన్ హాల్‌లో నిర్వహించనున్న ఆత్మీయ సమ్మేళనానికి తెలంగాణ ఉద్యమకారులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమకారులు పల్లె వినయ్, బీరెల్లి వెంకట్ రెడ్డి, కే . వీ రంగారెడ్డి, కూర రమేష్, గోర శ్యామ్ సుందర్, చామకూర రాజు, కే.వీ గౌడ్, బాలస్వామి, స్కైలాబ్, ఇబ్రహీంపట్నం నియోజకవర్గం వేణు, మహేశ్వరం వెంకటాచారి, సాయిరాం, రాజు, కృష్ణ, సుధాకర్, తెలంగాణ ఉద్యమకారులు, వివిధ నియోజకవర్గాల తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!