ePaper
Friday, October 16, 2026
📄 ePaper
Homeఎల్బీనగర్చెత్తనూ.. వదలని చె.. మాజీ కార్పొరేటర్..!?

చెత్తనూ.. వదలని చె.. మాజీ కార్పొరేటర్..!?

📰 Generate e-Paper Clip

ఆటోనగర్‌లో చెత్త డంపింగ్‌పై వివాదం..!

“ఇక్కడ చెత్త వేయమని కార్పొరేటరే చెప్పారు”.. రాంకీ సిబ్బంది అన్నారంటూ స్థానికుల ఆరోపణలు..!

ఒక్కోరకం చెత్తకు ఒక్కో రేటు కట్టి మరీ.. రాంకీ సంస్థ నుండి తాజా మాజీ కార్పొరేటర్ వసూలు చేస్తున్నట్లు స్థానికుల అనుమానాలు.!?

మన్సురాబాద్ తాజా మాజీ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి పై స్థానిక కాలనీవాసుల ఆగ్రహం..?

చెత్త తరలింపుపై కాలనీవాసుల అభ్యంతరం.. ప్రజారోగ్యంపై ఆందోళన

సోషల్ మీడియాలో వీడియోలు వైరల్..

మన తొలివెలుగు | ఎల్బీనగర్ :

మన్సూరాబాద్ డివిజన్ పరిధిలోని ఆటోనగర్ డంపింగ్ యార్డ్‌ పరిసరాల్లో చెత్త వేస్తున్నారనే అంశం వివాదానికి దారితీసింది. రోడ్లపై చెత్త వేయడాన్ని నిరసిస్తూ పరిసర కాలనీల వాసులు చెత్త తరలిస్తున్న వాహనాలను అడ్డుకుని రాంకీ సిబ్బందిని ప్రశ్నించినట్లు సమాచారం. ఈ సందర్భంగా తమను ఇక్కడ చెత్త వేయమని కార్పొరేటర్ కొప్పుల నర్సింహారెడ్డి చెప్పారని రాంకీ సిబ్బంది సమాధానం ఇచ్చినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. అయితే ఒక్కో రకం చెత్తకు.. ఒక్కో రేట్ కట్టి మరీ రాంకీ సంస్థ నుండి తాజా మాజీ కార్పొరేటర్ మామూలు వసూలు చేస్తున్నట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆరోపణలపై  సంబంధిత వ్యక్తుల వివరణ తెలియాల్సి ఉంది. కాగా దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి.

చెత్తతో ప్రజారోగ్యానికి ముప్పు?

ఆటోనగర్ రోడ్లపై మెడికల్ వేస్టేజీ, జంతు వ్యర్థాలు, హోటళ్ల నుంచి వచ్చే చెత్తతో పాటు ఇతర వ్యర్థాలను కూడా తరలించి వేస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. లారీలు, ట్రాక్టర్ల ద్వారా చెత్త తీసుకొచ్చే వ్యవహారంలో వేర్వేరు రేట్ల పేరుతో వసూళ్లు జరుగుతున్నాయని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తేవాలని వారు కోరుతున్నారు. రోడ్లపై చెత్త పేరుకుపోవడం వల్ల పరిసరాలు అపరిశుభ్రంగా మారడంతో పాటు దుర్వాసన, వ్యాధుల వ్యాప్తి వంటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా వైద్య వ్యర్థాలు, జంతు కళేబరాల నిర్వహణలో నిబంధనలు పాటిస్తున్నారా లేదా అన్న అంశంపై అధికారులు దృష్టి సారించాలని డిమాండ్ చేస్తున్నారు.

రోడ్డు ఆక్రమణపైనా అనుమానాలు

ఆటోనగర్ రోడ్డులో గతంలో చిన్నదిగా ఉన్న దర్గా నిర్మాణం ప్రస్తుతం రోడ్డును ఆక్రమించే స్థాయిలో విస్తరించిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. అలాగే గతంలో నిలిచిపోయాయని చెబుతున్న జంతు కళేబరాల వ్యర్థాల డంపింగ్ మళ్లీ ప్రారంభమైందని పేర్కొంటున్నారు. ఈ పరిణామాల వెనుక ఎవరి పాత్ర ఉందన్నది అధికారుల విచారణలో తేలాల్సి ఉంది.

అధికారుల చర్యల కోసం ఎదురుచూపులు

ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి చొరవతో ఆటోనగర్ డంపింగ్ యార్డ్ పరిసరాల్లో గతంలో చేపట్టిన అభివృద్ధి పనులకు ఆటంకం కలగకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు. ప్రస్తుత చెత్త డంపింగ్ సమస్యపై సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి, రోడ్లపై అక్రమంగా వ్యర్థాలు వేస్తున్నారనే ఆరోపణలను పరిశీలించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

స్థానికుల ప్రధాన డిమాండ్లు:

రోడ్లపై చెత్త డంపింగ్‌ను అరికట్టాలి. వైద్య వ్యర్థాలు, జంతు వ్యర్థాల నిర్వహణపై విచారణ జరపాలి. అక్రమ వసూళ్ల ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలి. రోడ్డు ఆక్రమణ ఆరోపణలను పరిశీలించి నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలి. బాధ్యులుగా తేలిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలి. ఆటోనగర్ పరిసరాల పరిశుభ్రత, ప్రజారోగ్యం కాపాడేందుకు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!