మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశం
ఉత్తమ అధికారులకు నగదు బహుమతులు ప్రకటన
మన తొలివెలుగు ఉమ్మడి మహబూబ్ నగర్ బ్యూరో ప్రతినిధి ఎన్. హరీష్ :
ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ప్రక్రియను ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా, వేగంగా పూర్తి చేయాలని మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. శనివారం వీపనగండ్లలో బూత్ లెవల్ అధికారులు, బూత్ లెవల్ ఏజెంట్లుతో ఆయన సమీక్ష నిర్వహించారు. వలస వెళ్లిన ఓటర్లను ఫోన్లలో సంప్రదించి, అర్హులైన ప్రతి ఒక్కరినీ ఓటరుగా నమోదు చేయాలన్నారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియను గడువులోగా విజయవంతంగా పూర్తి చేసిన సిబ్బందిని ప్రోత్సహించేందుకు తొలి బహుమతిగా రూ.10వేలు ద్వితీయ బహుమతిగా రూ.5 వేలు నగదు పురస్కారాలు అందిస్తామని మంత్రి ప్రకటించారు.

