ePaper
Wednesday, September 16, 2026
📄 ePaper
Homeమహేశ్వరంచిరుజల్లులు కురిస్తేనే చెరువును తలపిస్తున్న విశాఖ నగర్ ఫేస్-1 ప్రధాన రహదారి

చిరుజల్లులు కురిస్తేనే చెరువును తలపిస్తున్న విశాఖ నగర్ ఫేస్-1 ప్రధాన రహదారి

📰 Generate e-Paper Clip

సీసీ రోడ్డు వేయండి మహా ప్రభో అంటున్న కాలనీవాసులు

మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య ముదిరాజ్ :

మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని 57వ డివిజన్ పరిధి అల్మాస్ గూడలోని విశాఖనగర్ డివిజన్ ఫేస్ -1 ప్రధాన రహదారు మార్వాడీ దేవాలయం సమీపంలో సీసీ రోడ్డు అద్వానంగా ఉందని అభివృద్ధి చేయాలని విశాఖ నగర్ ఫేస్-1 వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు కే. శ్రీరామ్ రెడ్డి, గౌరవ అధ్యక్షుడు సుభాష్ రెడ్డి అధికారులను కోరారు. వారు కాలనీ సంక్షేమ సభ్యులు, కాలనీ వాసులతో కలిసి చెరువును తలపిస్తున్న రహదారిని పరిశీలించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 2012 సంవత్సరంలో అధికారులు సీసీ రోడ్డు అభివృద్ధి చేశారన్నారు. రహదారి ఇరువైపులా ఇండ్లు లేకపోవడంతో వర్షం వచ్చిన ప్రతిసారి వర్షం నీరు పక్కనే ఉన్న పొలాల్లోకి ప్రవహించేది అన్నారు. ప్రస్తుతం ఇంటి నిర్మాణాలు జరగడం, దీనికి తోడు 2 సంవత్సరాల క్రితం డ్రైనేజీ అభివృద్ధి కోసం తవ్విన రోడ్లను సకాలంలో పునరుద్ధరించకపోవడంతో చాలాచోట్ల రహదారి అస్తవ్యస్తంగా మారిందన్నారు. ఎక్కడ పడితే అక్కడ గుంతులు పడినా పట్టించుకునే వారు కరువయ్యారు. బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ లో అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదన్నారు. గత సంవత్సరం డీఈ, ఏఈలు వచ్చి పరిశీలించారు, కానీ ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉందన్నారు. చిన్నపాటి వర్షం వచ్చినప్పుడుల్లా రహదారిలో నీరు నిలిచి దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. అలాంటిది భారీ వర్షం పడిందంటే పరిస్థితి చెప్పనక్కర్లేదన్నారు.

చిన్నపాటి వర్షం పడితే ఆ గోతుల్లో నీరు చేరి చెరువు కుంటను తలపిస్తుందన్నారు. దీన్ని గుర్తించని ద్విచక్ర వాహనదారులు అదుపు తప్పి ప్రమాదాలకు గురవుతున్నారని తెలిపారు. రాత్రి వేళల్లో ఈ రోడ్డులో ప్రయాణించడం సాహసమేనని అంటున్నారు. డ్రైనేజీ అభివృద్ధి కోసం తవ్విన రోడ్డున అలాగే వదిలేయడంతో గత 2 సంవత్సరాల నుంచి ఈసారి వర్షం పడిన సమయంలో కాలనీ వాసులు కాకుండా గుర్రం గూడా, బి.యన్ రెడ్డి వైపు వెళ్లే ప్రయాణికులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. అధికారులు తమ కాలనీ ప్రధాన రహదారిపై దృష్టి సారించి నిధులు కేటాయించి సీసీ రోడ్డు అభివృద్ధి చేసి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ సంక్షేమ సంఘం జనరల్ సెక్రెటరీ లక్ష్మణరావు, సలహాదారులు రమేష్ రావు, బాలరాజ్, జె. శ్రీను, అంజయ్య , కృష్ణ, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!