మన తొలివెలుగు, ఉమ్మడి మహబూబ్ నగర్ బ్యూరో : తొలి, మలిదశ తెలంగాణ ఉద్యమాల్లో పాల్గొన్న నిజమైన ఉద్యమకారులను గుర్తించి న్యాయం చేయాలని కోరుతూ ‘తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ’ శుక్రవారం టీజేఏసీ చైర్మన్, టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షులు కోదండరాంకు వినతిపత్రం సమర్పించింది. రాజకీయాలకు అతీతంగా వనపర్తి జిల్లా వ్యాప్తంగా సేకరించిన అర్హుల జాబితాను అందజేసినట్లు టీజేఏసీ కన్వీనర్ టి.గాంధీ, అక్కల బాబుగౌడ్ తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ గుర్తింపు ఇవ్వాలని వారు కోరారు.
నిజమైన ఉద్యమకారులను గుర్తించాలి
0
37
Previous article

