ఎల్బీనగర్: హయత్ నగర్ లోని బాతుల చెరువు పెద్దమ్మ తల్లి సాక్షిగా కబ్జాకు గురవుతుంది. చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో పెద్దమ్మ గుడి పక్కనే అక్రమార్కులు చుట్టూ కడీలతో ఫెన్సింగ్ ఏర్పాటు చేసి దాదాపు రూ. 5 కోట్ల విలువైన చెరువు భూమిలో జేసీబీలతో చదును చేశారు. ఇంత జరుగుతున్న రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు చర్యలు తీసుకోకపోవడం పై భారీ మొత్తంలో ముడుపులు ముట్టినట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక హయత్ నగర్ మండల తహసిల్దార్ ను వివరణ కోసం ప్రయత్నించగా ఫోన్ లిఫ్ట్ చేయపోవడం కొసమేరుపు..
పూర్తి అప్డేట్స్ త్వరలో.. మన తొలివెలుగు మెయిన్ ఎడిషన్ లో…

