ePaper
Wednesday, September 16, 2026
📄 ePaper
Homeమహేశ్వరంభారీ ఊరేగింపును జయప్రదం చేయండి

భారీ ఊరేగింపును జయప్రదం చేయండి

📰 Generate e-Paper Clip

శ్రీ కృష్ణ భగవాన్, కామధేను, మయూర విగ్రహాల ఊరేగింపు లో యాదవ కులభాంధవులు, కుటుంబసభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపు

మన తొలివెలుగు: మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య 

ఈ నెల 31 న సాయంత్రం 6 గంటలకు శ్రీ కృష్ణ భగవాన్, కామధేను, మయూర విగ్రహాలకు స్వాగతం పలికే కార్యక్రమం నిర్వహించనున్న అఖిల భారత యాదవ మహాసభ జిల్లెలగూడ, మీర్ పేట్ ఊరేగింపులో యాదవ కులభాంధవులు, కుటుంబ సభ్యులతో సహ శ్రీకృష్ణ పరమాత్మ భక్తులు అందరూ పెద్ద సంఖ్యలో పాల్గొనాలని జిల్లెలగూడ, మీర్ పేట్ శ్రీకృష్ణ భగవాన్ విగ్రహ నిర్మాణ కమిటీ సభ్యులు పిలుపునిచ్చారు. శ్రీకృష్ణ భగవాన్ నిర్మాణ కమిటీ జిల్లెలగూడ, మీర్ పేట్ ఆధ్వర్యంలో మీర్ పేట మంత్రాల చెరువులో ఉన్నటువంటి 8 అడుగుల రాతి గుండు పైన 10 అడుగుల కామదేను సహిత శ్రీ కృష్ణ భగవాన్, మయూర విగ్రహాలను స్థాపించడానికి నిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్నవని త్వరలో విగ్రహ ప్రతిష్టాపన నిర్వహించడం జరుగుతుందని కమిటీ సభ్యులు తెలిపారు.

ఈ ఊరేగింపు కార్యక్రమానికి బందోబస్తు ఏర్పాటు చేయాలని మీర్ పేట్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శోభన్ కి నిర్మాణ కమిటీ ఆధ్వర్యంలో వినతి పత్రం ఇచ్చామన్నారు. ఈ కార్యక్రమంలో యాదవ కుల పెద్దలు జనిగే జంగయ్య యాదవ్, ఆవుల సత్తయ్య యాదవ్, దేవనమోని శ్రీనివాస్ యాదవ్, బచ్చనమోని కాశీరాం యాదవ్, ఎనుగుల అనిల్ కుమార్ యాదవ్, అబ్బనమొని గోపి యాదవ్, బచ్చనమొని నర్సింహా యాదవ్ , వర్ధన్ నాగేష్ యాదవ్, జనిగే శ్రీశైలం యాదవ్, బచ్ననమొని సైదులు యాదవ్, ఎనుగుల రవికుమార్ యాదవ్, మద్ది యాదగిరి యాదవ్, వట్టి శ్రీశైలం యాదవ్, మద్ది శ్రీనివాస్ యాదవ్, బెల్లి శివ యాదవ్ తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!