ePaper
Wednesday, September 16, 2026
📄 ePaper
Homeమహేశ్వరంమహేశ్వరం మండలాన్ని పూర్తిగా ఫ్యూచర్ సిటీలో కలపాలి

మహేశ్వరం మండలాన్ని పూర్తిగా ఫ్యూచర్ సిటీలో కలపాలి

📰 Generate e-Paper Clip

ఫ్యూచర్ సిటీలో మహేశ్వర మండలాన్ని కలపడానికి తీర్మానాలు చేసి మండల అభివృద్ధికి సహకరించాలని కోరిన జేఏసీ నాయకులు

మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య ముదిరాజ్ :

ఫ్యూచర్ సిటీలో కేవలం కొన్ని గ్రామాలను మాత్రమే కలపకుండా మహేశ్వర మండలాన్ని పూర్తిగా విలీనం చేసి ఫ్యూచర్ సిటీలో కలిపేంత వరకు పోరాటం చేస్తామని ఫ్యూచర్ సిటీ జేఏసీ చైర్మన్ రఘుపతి, ఫ్యూచర్ సిటీ జేఏసీ గౌరవ అధ్యక్షుడు కర్నాటి మనోహర్ నేత, జేఏసీ సభ్యులు కాకి ఈశ్వర్ ముదిరాజ్, వర్కల యాదగిరి, గదగూటి మహేందర్ ముదిరాజ్, శ్రీహరి, సుదర్శన్ తదితరులు తెలిపారు. మహేశ్వరం మండల కేంద్రంలో ఫ్యూచర్ సిటీ జేఏసీ నాయకులు ఫ్యూచర్ సిటీలో మహేశ్వరం మండలం పూర్తి విలీనం కోరుతూ ఫ్యూచర్ సిటీలో కేవలం కొన్ని గ్రామాలను మాత్రమే కలపకుండా మహేశ్వర మండలాన్ని పూర్తిగా విలీనం చేసేలా భవిష్యత్తు కార్యాచరణ పై ప్రధాన ఎజెండాగా చర్చించారు. ఆ దిశగా పోరాటం చేయాలని కార్యాచరణకు రూపకల్పన చేశారు.

ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ.. చారిత్రాత్మకమైన మహేశ్వరం మండల ప్రాంతం అన్ని రంగాల్లో వెనకబడి ఉందన్నారు. మనలో ఐక్యత లోపం నిర్లక్ష్యం కారణంగా మన కళ్ళముందే మన ప్రాంతంలో ఉన్న వివిధ ప్రభుత్వ కార్యాలయాలను ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. మన మహేశ్వరానికి అన్యాయం జరగబోతుందన్నారు. చారిత్రాత్మకమైన మహేశ్వరం మండల ప్రాంతం అన్ని రంగాల్లో వెనకబడి ఉన్నదని పేర్కొన్నారు. ఈ ప్రాంతంలోని నేతలు వివిధ రాజకీయాల్లో అంచలంచెలుగా ఎదిగారన్నారు. మనలో ఐక్యత లేక పోవడంతో ఆయా రాజకీయ పార్టీలకు కొమ్ము కాస్తూ మన ప్రాంత అభివృద్ధిని చేసుకోలేక పోయామన్నారు. మన ప్రాంతంలో ఉన్న వివిధ కార్యాలయాలు ఇతర ప్రాంతాలకు తరలిస్తుంటే చూస్తూ ఊరుకుందామా అని ప్రశ్నించారు. భావితరాల భవిష్యత్తు కోసం, మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు, బాగుండాలంటే ఫ్యూచర్ సిటీలో మహేశ్వరం మండలాన్ని కలపాల్సిందే అన్నారు. మన ప్రాంత భవిష్యత్తు కోసం రాజకీయ జెండాలు పక్కన పెట్టి కేవలం ఫ్యూచర్ సిటీలో కలపడం కోసమే మన పోరాటం అని గుర్తుంచుకోవాలన్నారు. మహేశ్వరం మండల మనగడను కాపాడు కోవడానికి యుద్ధానికి శ్రీకారం చుట్టాలని నిర్ణయించామన్నారు. మండలంలోని అన్ని గ్రామాలను ఫ్యూచర్ సిటీలో కలిపేంత వరకు పోరాటం ఆపేది లేదన్నారు. ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఎంత వరకైనా పోరాటం చేస్తామని తెలిపారు. ప్రతి గ్రామంలో గ్రామ సభలు పెట్టండి తీర్మానాలు చేయండి. లేకపోతే చరిత్ర హీనులుగా మిగిలిపోతారన్నారు. అభివృద్ధి అడ్డుకుంటే పుట్టగతులు ఉండవన్నారు. ఐక్యమత్యంగా ఉండి పార్టీలకతీతంగా మన ప్రాంత అభివృద్ధికి సహకరించుకుందాం అన్నారు. చేతులు జోడించి నమస్కరించి చెబుతున్నాము గ్రామంలో ప్రతి సర్పంచ్ ప్రజలతో సమావేశాలు ఏర్పాటు చేసి ఫ్యూచర్ సిటీకి అనుకూలంగా తీర్మానాలు చేయించి ప్రభుత్వానికి పంపిద్దాం అని తెలిపారు. మహేశ్వరం మండలాన్ని పూర్తిగా ఫ్యూచర్ సిటీలో కలిపేందుకు సహకరించాలని కోరారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!