ePaper
Wednesday, September 16, 2026
📄 ePaper
Homeమహేశ్వరంమాజీ సీఎం కేసీఆర్ అహర్నిశల కృషి, అమరవీరుల త్యాగాల ఫలితమే తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది 

మాజీ సీఎం కేసీఆర్ అహర్నిశల కృషి, అమరవీరుల త్యాగాల ఫలితమే తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది 

📰 Generate e-Paper Clip

మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి

మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య :

మాజీ సీఎం కేసీఆర్ అహర్నిశల కృషి, అమరవీరుల త్యాగాల ఫలితమే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు ‌. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని మహేశ్వరం నియోజకవర్గంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే జాతీయ జెండాను ఆవిష్కరించి తెలంగాణ ప్రజలకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ సాధన కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరులను ఈ సందర్భంగా స్మరించుకుంటూ వారికి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఎందరో అమరవీరుల త్యాగాలు, ఉద్యమకారుల పోరాటాలు మాజీ సీఎం అహర్నిశల కృషి ఫలితంగా తెలంగాణ కళ సాకారమైందని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి వల్ల అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించి దేశానికి ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు అర్కల కామేష్ రెడ్డి, అర్కల భూపాల్ రెడ్డి, దీప్లాల్ చౌహాన్, సిద్దాల పెద్ద బీరప్ప, అనిల్ కుమార్ యాదవ్, దిండు భూపేష్ గౌడ్, బొక్క రాజేందర్ రెడ్డి, తెలంగాణ ఉద్యమ నాయకులు హనుమంతరావు, శీను నాయక్, సిద్దాల చిన్న బీరప్ప , నర్సిరెడ్డి, బాల్రాజ్ ,సిద్దాల అంజయ్య, పోరెడ్డి ప్రభాకర్ రెడ్డి, సునీత బాలరాజ్, పంతంగి మాధవి, లలితా జగన్, నూర్జహాన్ తదితర నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!