మన తొలివెలుగు, ఇబ్రహీంపట్నం ప్రతినిధి సిహెచ్ రాజు :
బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ‘యువ సంగ్రామ సదస్సు’కు యాచారం మండల పరిధిలోని వివిధ గ్రామాల నుంచి యువత భారీగా తరలివెళ్లారు. సరూర్ నగర్ స్టేడియంలో నిర్వహించిన సభ కోసం జిల్లా పార్టీ అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్ రెడ్డి పర్యవేక్షణలో, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు మంచిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో తరలింపు ర్యాలీని నిర్వహించారు. గ్రామగ్రామాన గులాబీ శ్రేణులు ‘జై తెలంగాణ’ అంటూ నినదిస్తూ నిరుద్యోగులు ముందుకు సాగారు.

