పంటల వేసుకునేందుకు సాగునీరు వెంటనే విడుదల చేయాలి
ర్యాలంపాడు, గుడ్డెందొడ్డి, రిజర్వాయర్ల కాలువలను సందర్శించిన బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జి బాసు హనుమంతు నాయుడు
మన తొలివెలుగు, గద్వాల ప్రతినిధి గడ్డం సుధాకర్ :
రైతులకు సాగునీరు అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని బీఆర్ఎస్ పార్టీ గద్వాల నియోజకవర్గం ఇంచార్జ్ బాసు హనుమంత నాయుడు విమర్శించారు. కనీసం కాలువలలో చెట్లును తొలగించలేని స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నదని వాపోయారు. శుక్రవారం గద్వాల నియోజకవర్గం ధరూర్ మండలంలోని గుడ్డెందొడ్డి, ర్యాలంపాడు రిజర్వాయర్ల కింద ఉన్న కాలువలను పార్టీ నాయకులు, రైతులతో కలిసి బాసు హనుమంతు నాయుడు గార పరిశీలించారు. అనంతరం గుడ్డెందొడ్డి, ర్యాలంపాడు రిజర్వాయర్లని సందర్శించి, ప్రస్తుతం రిజర్వాయర్లో నీటి సామర్ధ్యాన్ని అధికారులను అడిగి తెలుసుకున్నారు. జూరాల రైట్ మెయిన్ కెనాల్ ను సందర్శించిన ఆయన కెనాల్ పూర్తిగా దెబ్బతిన్నదని, దానికి వెంటనే మరమ్మత్తులు చేయాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గుడ్డెందొడ్డి రిజర్వాయర్ లో 1 టీఎంసీ సామర్థ్యం నీళ్లు ఉన్నా.. రైతులు పంట పొలాలు వేసుకునేందుకు కాలువలకు నీళ్లు ఇవ్వలేని స్థితిలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నదని ధ్వజమెత్తారు. కనీసం కాలువల్లో చెట్లను (జమ్ము) ను తొలగించలేని స్థితిలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఉన్నాదని ఆరోపించారు. నీళ్లు ఇవ్వాలని అడిగితే కేటీఆర్, హరీష్ రావుని కోసి రక్తం పంటలకు చల్లితే పండుతాయని ముఖ్యమంత్రి అనడం ఎంతవరకు సముచితమని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఇలా మాట్లాడడం సిగ్గుచేటని విమర్శించారు. రైతులను, ప్రజాస్వామ్యాన్ని అవనమానించేలా ముఖ్యమంత్రి మాటలు ఉన్నాయన్నారు.
బీఆర్ఎస్ పాలనలో రైతులకు రెండు పంటలకు సాగునీటిని అందించిన ఘనత కేసీఆర్ దే అని అన్నారు. 24 గంటల విద్యుత్, పెట్టుబడి సాయం, రైతుబీమా వంటి పథకాలు ఎన్నో అందించారని గుర్తు చేశారు. కానీ రేవంత్ రెడ్డి వచ్చాక ఒక్క స్కీం కూడా అమలు చేయలేదని విమర్శించారు. పంటలు వేసుకునేందుకు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో ఎప్పటికప్పుడు నీళ్లిచ్చి, పంటలను కాపాడామని గుర్తు చేశారు. వెంటనే అధికారులు స్పందించి రైతులకు పంటలు వేసుకునేందుకు కాల్వలకు నీళ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో జి.రాఘవేంద్ర రెడ్డి, అల్లాపాడు ప్రతాప్, శ్రీనివాస్ గౌడ్, సీ.కే. రంగన్న, చిన్నపాడు ఆంజనేయులు, ధర్మా రావు, బీచుపల్లి, లాలప్ప, మంత్ర నాయక్, మోనేష్ మారోజు, వెంకటేష్ నాయుడు,vజాంపల్లి భరత్ సింహారెడ్డి, కావాలి గోపి, గోవిందు, రాము, రజిని బాబు, నరసింహులు, సుభాష్ రంగారెడ్డి, వెంకటేష్, రమేష్, మాలిక్, ప్రవీణ్, కృష్ణ, మోహన్, భీమేష్, ఆంజనేయులు, నాగేష్, ఈరన్న, తిమ్మప్ప, రాముడు, మల్లికార్జున్, మహేందర్, నరేష్, హరికృష్ణ, వీరేష్, జయన్న, వెంకటప్ప, శివ, నాగరాజు, కళ్యాణ్, పార్టీ నాయకులు, కార్యకర్తలు, వివిధ గ్రామాల రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

