ePaper
Wednesday, September 16, 2026
📄 ePaper
Homeమహేశ్వరంసీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరం

సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరం

📰 Generate e-Paper Clip

మన తొలివెలుగు: మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య 

అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న పేదలకు సీఎం సహానిధి వరంగా మారుతోందని, పార్టీలకు అతీతంగా అర్హులందరికీ సాయం అందుతోందని మహేశ్వరం సర్పంచ్ మునగపాటి నవీన్ అన్నారు. మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆదేశాల మేరకు మహేశ్వరం గ్రామానికి చెందినటువంటి పుట్లగారి కల్పన, జాల సాలమ్మ, ఏలే శంకర్ దాస్, ఆంగోత్ ఆనంద్ 4 గురికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను సర్పంచ్ మునగపాటి నవీన్, ఉప సర్పంచ్ జోరల రమేష్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం రిలీఫ్ ఫండ్ ను పేదలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కరోళ్ల చంద్రయ్య ముదిరాజ్, మాజీ సర్పంచ్ స్వర్ణగంటి ఆనందం, పీఏసీఎస్ డైరెక్టర్లు పోల్కం బాలయ్య, కాడమోని ప్రభాకర్, మండల కో- ఆప్షన్ మెంబర్ సయ్యద్ ఆదిల్ అలీ, వార్డు సభ్యులు ఆకుల వీరి బాబు, గ్రామ శాఖ అధ్యక్షుడు కటికల మహేందర్ ముదిరాజ్, ఉపాధ్యక్షులడు దూసకంటి మహేందర్, సున్నం కృష్ణ, ఆవుల కాడి శ్రీశైలం, పేయాల చేన్నయ్య, కటికల శంకర్, జాపులనాయక్, కుమ్మరి రాజు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!