ePaper
Wednesday, September 16, 2026
📄 ePaper
Homeకుత్బుల్లాపూర్సీఎం రిలీఫ్ ఫండ్ సద్వినియోగం చేసుకోవాలి

సీఎం రిలీఫ్ ఫండ్ సద్వినియోగం చేసుకోవాలి

📰 Generate e-Paper Clip

ఎమ్మెల్యే కే.పీ వివేకానంద్ 

మన తొలివెలుగు: కుత్బుల్లాపూర్ ప్రతినిధి టీ. రమేష్

అనారోగ్యంతో బాధపడుతూ మెరుగైన వైద్యం కోసం ఎదురుచూస్తున్న లబ్ధిదారుడికి బీఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కే.పీ.వివేకానంద్ ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి మంజూరు చేయించిన ఎల్ఓసీ పత్రాలను గురువారం చింతల్ లోని కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో లబ్దిదారులకు అందజేశారు. ఎల్ఓసీ పత్రాల అందజేతలో భాగంగా సీఎంసీ 129 – సూరారం డివిజన్ నెహ్రు నగర్ కి చెందిన కొండవీటి అన్నమ్మ భర్త కే. మంతెనయ్య కు రూ.75,000/- (డెబ్భై ఐదు వేల రూపాయలు) మంజూరు కాగా, 130 – సుభాష్ నగర్ డివిజన్ సూరారం కాలనీకి చెందిన నూకారపు సూర్యనారాయణ తండ్రి ఎన్. రామినాయుడు కు రూ.1,50,000/- (ఒక లక్ష యాభై వేల రూపాయలు) మంజూరు కాగా ఆయా డివిజన్లకు చెందిన లబ్దిదారుల కుటుంబసభ్యులకు ఎల్ఓసీ పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు మంత్రి సత్య నారాయణ, సురేష్ రెడ్డి, డివిజన్ అధ్యక్షులు పోలే శ్రీకాంత్, డివిజన్ ప్రధాన కార్యదర్శి సిద్దిక్, నాయకులు బలరాం రెడ్డి, గుబ్బల లక్ష్మీనారాయణ, ప్రభుదాస్, దుర్గారావు, వెంకట్ రెడ్డి, విజయ్ కుమార్, లక్ష్మణ్, రాజు, సత్యనారాయణ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!