ePaper
Friday, September 18, 2026
📄 ePaper
Homeతెలంగాణహైదరాబాద్ఘనంగా హిందూ సమ్మేళనం

ఘనంగా హిందూ సమ్మేళనం

📰 Generate e-Paper Clip

స్వామీజీ రాక— వేద పండితులచే మంత్రోచరణాలు, నాదస్వరం, మేళతాళాల నడుమ ఘన స్వాగతం పలికిన భక్తులు, నిర్వాహకులు 

మన తొలివెలుగు, చాంద్రాయణగుట్ట ప్రతినిధి శైలేష్ కుమార్ 

హైదరాబాద్ పాతబస్తీ కందికల్ గేట్, సమీపంలో ఉన్న శ్రీ చిత్ర గుప్త దేవాలయం లో శనివారం సాయంత్రం ‘హిందూ సమ్మేళనం’ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పూజ్య శ్రీ సిద్ధ ప్రజ్ఞ్య నంద స్వామీజీకి నిర్వాహకులు, భక్తులు కాషాయ కండువాలతో, పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ మహారాజ్, భారతమాత చిత్రాలు దర్శనమిచ్చాయి.

చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు—ఆకట్టుకున్న నృత్యాలు

స్వామీజీ మాట్లాడుతూ, హిందూ ధర్మ పరిరక్షణ, జాతీయ ఐక్యత, సనాతన సంస్కృతి విలువలను కాపాడుకోవడమే ఈ సమ్మేళనం లక్ష్యమని తెలిపారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ స్ఫూర్తితో యువత ధర్మం కోసం, దేశం కోసం నిలబడాలని పిలుపునిచ్చారు. నిర్వాహకులు మాట్లాడుతూ.. రాబోయే తరాలకు మన సంస్కృతి, సంప్రదాయాలను అందించడమే హిందూ సమ్మేళనం ముఖ్య ఉద్దేశమని, అందులో భాగంగానే చిన్నారులతో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మహిళలు, యువకులు, పలువురు ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!