ePaper
Friday, September 18, 2026
📄 ePaper
Homeతెలంగాణమాఫియా డాన్ ఉచ్చులో.. టూరిస్ట్ లీడర్..?

మాఫియా డాన్ ఉచ్చులో.. టూరిస్ట్ లీడర్..?

📰 Generate e-Paper Clip

మట్టి మాఫియా మాయాజాలం..!

ఎల్బీనగర్ లో రెచ్చిపోతున్న బీఆర్ఎస్ లీడర్లు..!

పేరుకే “టూరిస్ట్ లీడర్” అధికారపక్ష నేత.. చక్రం తిప్పుతున్నది స్థానిక ఎమ్మెల్యేనే..!

అధికారులంతా బీఆర్ఎస్ ఎమ్మెల్యే చెప్పుచేతల్లోనే..!

ఇల్లీగల్ మైనింగ్ తో కోట్లు గడిస్తున్న బీఆర్ఎస్ నేతలు

సహకరిస్తున్న హయత్ నగర్ మండల తహశీల్దార్

అధికారులను పట్టించుకోని కాంగ్రెస్ పార్టీ

మధుయాష్కి గౌడ్ టూరిస్ట్ లీడర్ కావడమే కారణమా..?

అడ్డగోలు సంపాదనలో బీఆర్ఎస్ నేతలు

ఒక్క నమిశ్రీ తోనే కోట్లలో అక్రమ సంపాదన..!

ఎల్బీనగర్‌లో అక్రమ తవ్వకాల కలకలం

నమిశ్రీ చుట్టూ మట్టి దందా మర్మం..!

అనుమతులు ఎక్కడ..? అక్రమ తవ్వకాలు ఎవరి అండతో..?

మన తొలివెలుగు EXCLUSIVE | రిపోర్ట్ :

ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలో అక్రమ మట్టి తవ్వకాలు, తరలింపుపై ఆరోపణలు రాజకీయంగా వేడి పెంచుతున్నాయి. ముఖ్యంగా హయత్‌నగర్ మండలంలో నిర్మాణాల పేరుతో భారీగా మట్టి తవ్వకాలు, తరలింపు జరుగుతున్నాయన్న ఆరోపణలు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి.

నమిశ్రీ చుట్టూ మట్టి దందా మర్మం..!

హయత్‌నగర్ మండలంలోని నమిశ్రీ బిల్డర్స్‌కు సంబంధించిన తవ్వకాలు, మట్టి తరలింపు వ్యవహారం ఇప్పుడు ప్రశ్నల వలయంలోకి వచ్చింది. తవ్వకాలకు సంబంధించిన అనుమతులు ఏమిటి..? వాటి గడువు ఎంత..? అనుమతించిన పరిమితుల్లోనే మట్టి తవ్వకాలు జరిగాయా..? అన్న అంశాలపై స్పష్టత అవసరమని స్థానికులు కోరుతున్నారు. అనుమతులు ఉన్నాయా..? ఉంటే ఎంత మేరకు..? తవ్విన మట్టిని ఎక్కడికి తరలించారు..? దాని విలువ ఎంత..? అనే ప్రశ్నలు ఇప్పుడు అధికారుల ముందున్నాయి.

అధికారం కాంగ్రెస్‌ది.. పెత్తనం బీఆర్ఎస్‌దా..?

నియోజకవర్గంలో అధికార కాంగ్రెస్ ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో కొందరు బీఆర్ఎస్ నేతల ప్రభావం కొనసాగుతోందన్న రాజకీయ విమర్శలు వినిపిస్తున్నాయి. అక్రమ మైనింగ్, మట్టి తరలింపు వ్యవహారాల్లో రాజకీయ జోక్యం ఉందన్న ఆరోపణలు కూడా తెరపైకి వస్తున్నాయి. అయితే ఈ ఆరోపణలకు సంబంధించి సంబంధిత అధికారులు అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది.

తహశీల్దార్ కార్యాలయం మెట్లెక్కినా.. చర్యలేవీ..?

అక్రమ మైనింగ్‌పై ఫిర్యాదులు అందుతున్నప్పటికీ సంబంధిత రెవెన్యూ అధికారులు తగిన చర్యలు తీసుకుంటున్నారా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. హయత్‌నగర్ తహశీల్దార్ కార్యాలయానికి ఫిర్యాదులు చేరినా క్షేత్రస్థాయిలో తనిఖీలు, చర్యలు ఎందుకు కనిపించడం లేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, అక్రమంగా తరలించిన మట్టి పరిమాణం, విలువపై అధికారికంగా లెక్కలు వెల్లడించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

కోట్ల మట్టి.. ఎవరి జేబుల్లోకి..?

భారీ స్థాయిలో మట్టి తవ్వకాలు జరిగితే దాని ద్వారా ఆర్థిక లాభం ఎవరికి చేకూరిందన్న అంశం కూడా విచారణలో తేలాల్సి ఉంది. మట్టి తవ్వకాలు, తరలింపునకు సంబంధించిన అనుమతులు, వాహనాల వివరాలు, రాయల్టీ/చలానాలు, రెవెన్యూ రికార్డులను పరిశీలిస్తే వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని స్థానికులు అంటున్నారు.

“టూరిస్ట్ లీడర్”పై రాజకీయ విమర్శలు..!

ఎల్బీనగర్‌లో జరుగుతున్న పరిణామాలపై కాంగ్రెస్ నేత మధు యాష్కి స్పందించాలంటూ ప్రత్యర్థి రాజకీయ వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. నియోజకవర్గంలో అక్రమ మైనింగ్ ఆరోపణలపై అధికార కాంగ్రెస్ నాయకత్వం స్పష్టమైన వైఖరి వెల్లడించాలని వారు కోరుతున్నారు.

సమగ్ర విచారణకు డిమాండ్

నమిశ్రీ వ్యవహారంతో పాటు హయత్‌నగర్ మండలంలో జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్న అక్రమ మట్టి తవ్వకాలు, తరలింపు వ్యవహారాలపై రెవెన్యూ, మైనింగ్ శాఖలు సంయుక్తంగా విచారణ చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

వెలుగులోకి వచ్చిన ఉదంతం ఇదొక్కటే.. బీఆర్ఎస్ కు అధికారులు సహకరించే ఉదంతాలు అనేకం ఉంటాయనే చర్చ కాంగ్రెస్ క్యాడర్ లో జోరుగా జరుగుతుంది.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!