ePaper
Wednesday, September 16, 2026
📄 ePaper
Homeతెలంగాణటూరిస్ట్ లీడర్..!

టూరిస్ట్ లీడర్..!

📰 Generate e-Paper Clip

పక్షం రోజులు పట్నంలో.. పది నెలలు విదేశాల్లో..!?

మన తొలి వెలుగు | ప్రత్యేక కథనం

నిజామాబాద్ రాజకీయాల్లో ఓటమి ఎదురైనా.. ఆ టూరిస్ట్ నేత తీరు మాత్రం మారడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఎల్బీనగర్ ప్రజలు గత ఎన్నికల్లో తిరస్కరించినప్పటికీ అధికారిక కార్యక్రమాల్లో మాత్రం హడావుడి చేస్తూ.. తాను ఎమ్మెల్యే అయినట్టుగా బిల్డప్ ఇస్తున్నారనే ఆరోపణలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. పక్షం రోజులు పట్నంలో.. పది నెలలు విదేశాల్లో ఉంటూ ప్రజలకు, పార్టీ క్యాడర్‌కు దూరంగా ఉంటున్నారనే విమర్శలు సైతం వినిపిస్తున్నాయి.

ఓడినా.. తగ్గని హడావుడి!

ఎన్నికల్లో ఎల్బీనగర్ ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించి క్షేత్రస్థాయిలో పార్టీ కోసం పనిచేయాల్సిన నేత.. అధికారిక కార్యక్రమాల్లో మాత్రం ముందుండేందుకు ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఎమ్మెల్యే పదవి లేకపోయినా అధికారిక కార్యక్రమాల్లో కీలక నేతగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో అసలు ప్రజా ప్రతినిధి ఎవరు? అనే చర్చ కూడా స్థానికంగా సాగుతోంది.

సొంత పార్టీ నేతలపైనే తిరుగుబాటు?

ప్రతిపక్షాలపై పోరాడాల్సిన సమయంలో సొంత పార్టీ నేతలపైనే అసంతృప్తి వ్యక్తం చేస్తూ తిరుగుబాటు ధోరణి అవలంబిస్తున్నారనే ఆరోపణలు పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఎన్నికల పరాజయంతో నిరుత్సాహంలో ఉన్న క్యాడర్‌కు ఈ పరిణామాలు మరింత ఇబ్బందికరంగా మారుతున్నాయని పార్టీ కార్యకర్తలు చెబుతున్నట్లు సమాచారం.

కుల రాజకీయాలతో పబ్బం?

స్థానిక రాజకీయాల్లో కుల సమీకరణాలను అడ్డుపెట్టుకుని రాజకీయ ప్రయోజనాలు పొందేందుకు ప్రయత్నిస్తున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి. కులాల మధ్య విభజనకు దారితీసే రాజకీయాలు పార్టీ బలోపేతానికి కాకుండా వ్యక్తిగత ప్రయోజనాలకే ఉపయోగపడతాయని పలువురు కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు.

నిజామాబాద్‌లో ఓటమి.. అయినా మారని తీరు!

నిజామాబాద్‌లో ప్రజలు ఇచ్చిన తీర్పు స్పష్టంగా ఉన్నప్పటికీ.. ఆ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకోకుండా పాత రాజకీయ ధోరణినే కొనసాగిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రజల్లోకి వెళ్లి వారి సమస్యలను తెలుసుకోవడం కంటే రాజకీయ హడావుడికే ప్రాధాన్యం ఇస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

క్యాడర్‌లో పెరుగుతున్న నిరుత్సాహం

నేతల మధ్య అంతర్గత విభేదాలు, క్షేత్రస్థాయిలో అందుబాటులో లేకపోవడం, వ్యక్తిగత ఆధిపత్య ధోరణి వంటి పరిణామాలతో పార్టీ క్యాడర్‌లో నిరుత్సాహం నెలకొంటోందనే చర్చ సాగుతోంది. పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలకు నాయకత్వం అందుబాటులో ఉండాలని.. ప్రజల్లో నమ్మకం పెంచేలా కార్యక్రమాలు చేపట్టాలని క్యాడర్ కోరుకుంటున్నట్లు తెలుస్తోంది.

ప్రజలు ఓడించినా.. తీరు మారకపోతే రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుంది టూరిస్ట్ లీడర్‌గా ముద్ర పడుతున్న ఈ నేత.. ఇకనైనా క్షేత్రస్థాయిలో ప్రజల మధ్య ఉంటారా? లేక అధికారిక కార్యక్రమాల హడావుడితోనే రాజకీయాలు కొనసాగిస్తారా? వేచి చూడాలి మరి..!?

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!