ePaper
Tuesday, November 3, 2026
📄 ePaper
Homeఎల్బీనగర్కాంగ్రెస్ హామీల అమలుకు బీఆర్‌ఎస్ డిమాండ్

కాంగ్రెస్ హామీల అమలుకు బీఆర్‌ఎస్ డిమాండ్

📰 Generate e-Paper Clip

“కాంగ్రెస్ బాకీ కార్డు”తో భారీ నిరసన..!

మన తొలివెలుగు | ఎల్బీనగర్ :

కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో “కాంగ్రెస్ బాకీ కార్డు” కార్యక్రమాన్ని నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఆరు గ్యారెంటీలతో పాటు ఎన్నికల సమయంలో ఇచ్చిన 420 హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నిరసన చేపట్టారు. ఎల్బీనగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో సరూర్‌నగర్ స్టేడియం నుంచి కొత్తపేట వరకు భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం వివిధ వర్గాల ప్రజలకు ఇచ్చిన హామీలు, వాటి అమలులో జాప్యం తదితర అంశాలను వివరిస్తూ భారీ ఫ్లెక్సీలను ప్రదర్శించారు. రైతులు, మహిళలు, నిరుద్యోగులు, విద్యార్థులు, వృద్ధులు, పేదలు తదితర వర్గాలకు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ బీఆర్‌ఎస్ నాయకులు నినాదాలు చేశారు. హామీల అమలులో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపిస్తూ, ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు.

ఈ నిరసన కార్యక్రమంలో నియోజకవర్గ పరిధిలోని పలువురు మాజీ కార్పొరేటర్లు, సీనియర్ నాయకులు, ఉద్యమకారులు, వివిధ డివిజన్ల అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, మహిళలు, పార్టీ అభిమానులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమం సందర్భంగా ప్రధాన రహదారిపై పార్టీ శ్రేణులు భారీగా తరలిరావడంతో రాజకీయ సందడి నెలకొంది.

“ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడం ప్రభుత్వ బాధ్యత. ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి” అని బీఆర్‌ఎస్ నాయకులు డిమాండ్ చేశారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!