ePaper
Sunday, May 3, 2026
📄 ePaper
Homeతెలంగాణరంగారెడ్డిఆపదలో ఉన్న కార్యకర్తకు ఆర్థిక సహాయం

ఆపదలో ఉన్న కార్యకర్తకు ఆర్థిక సహాయం

📰 Generate e-Paper Clip

మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య

ఆపదలో ఉన్న కార్యకర్తలకు ఎల్లవేళలా అండగా ఉంటానని పులిమామిడి గ్రామ బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు చింతకింది రమేష్ అన్నారు. కందుకూరు మండలం పరిధిలోని పులిమామిడి గ్రామంలో ఆ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు తిమ్మగల్ల శేఖర్ కుమారుడు తిమ్మగల అజయ్ బీఆర్ఎస్ పార్టీ యూత్ ప్రధాన కార్యదర్శి పదవి నిర్వహిస్తున్నారు. అతనికి అనారోగ్య పరిస్థితి ఉండడం వలన శనివారం పులిమామిడి గ్రామ బీఆర్ఎస్ పార్టీ తరఫున బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు చింతకింది రమేష్ వారికి ఆర్థిక సహాయం రూపంగా రూ. 5 వేలు ఆర్థిక సహాయం చేశారు. ఈ కార్యక్రమంలో కందుకూరు మండల బీఆర్ఎస్ పార్టీ స్పోర్ట్స్ కన్వీనర్ పాపగల్ల వెంకటేష్, గ్రామశాఖ యూత్ అధ్యక్షుడు పాపగల్ల రవి, ఉపాధ్యక్షుడు గోపాల్దాస్ గోపి,సీనియర్ నాయకులు గంగవరం చంద్రశేఖర్,రెవెల్లె సురేష్,యువ నాయకులు వత్తుల ప్రశాంత్,జాల కృష్ణ,తిమ్మగల్ల శ్రీనాథ్,బీసీ సెల్ అధ్యక్షులు జాల శ్రీకాంత్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు పాపగల్ల పవన్, మైనార్టీ సెల్ అధ్యక్షులు ఇబ్రహీం, కార్యనిర్వాహక అధ్యక్షుడు వత్తుల రంజిత్, అస్లాం, పాపగల్ల వినోద్ తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!