ePaper
Saturday, September 19, 2026
📄 ePaper
Homeయాదాద్రి భువనగిరి జిల్లాతెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష , ప్రధాన కార్యదర్శులుగా జెల్లెల పెంటయ్య ,...

తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష , ప్రధాన కార్యదర్శులుగా జెల్లెల పెంటయ్య , కొండమడుగు నర్సింహ్మ ఎన్నిక

📰 Generate e-Paper Clip

మన తొలివెలుగు, యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో ప్రతినిధి జంగిటి రవీందర్

రామన్నపేట మండల కేంద్రంలో 18,19 తేదీలలో జరిగిన తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా 3వ మహాసభలో 33 మందితో నూతన జిల్లా కమిటీ ఎన్నుకున్నారని, జిల్లా అధ్యక్షులుగా జెల్లెల్ల పెంటయ్య , ప్రధాన కార్యదర్శిగా కొండమడుగు నర్సింహ్మ, జిల్లా ఉపాధ్యక్షులు సిరిపంగి స్వామి, గుంటోజీ శ్రీనివాస్ చారి, రాచకొండ రాములమ్మ , సల్లురి కుమార్, సహాయ కార్యదర్శులుగా బొల్లు యాదగిరి, గంగాదేవి సైదులు, పల్లెర్ల అంజయ్య, జూకంటి పౌల్, కూకుట్ల చొక్కాకుమారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆరు వెంకట్రాములు ప్రకటించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి కొండమడుగు నర్సింహ్మ ఒక ప్రకటన ద్వారా జిల్లా మూడవ మహాసభలకు ఆతిథ్యమిచ్చి జయప్రదం చేసిన రామన్నపేట మండల కమిటీకి ప్రత్యేకమైన ధన్యవాదాలుతెలియజేశారు. ఈ మహాసభలకు జిల్లా వ్యాప్తంగా 250 మంది ప్రతినిధులు పాల్గొన్నారని ఈ సందర్భంగా జిల్లాలో కొనసాగుతున్న భూ పంపిణీ నిషేధం ఎత్తివేసి పేదలు, దళితులు, గిరిజనులు సాగు చేసుకుంటున్న ప్రభుత్వ భూములకు పట్టా సర్టిఫికెట్లు ఇవ్వాలని, కనీస వేతనాల చట్టము అమలు చేసి వ్యవసాయ కూలీలకు రోజు కూలీ 800 రూపాయలు ఇవ్వాలి, జిల్లాలో ప్రాజెక్టుల కింద, కాలువల కింద, త్రిబుల్ ఆర్ రోడ్ లో భూములు కోల్పోతున్న రైతులతో పాటు భూముల మీద ఆధారపడి జీవిస్తున్న వ్యవసాయ కూలీలకు కూడా 2013 భూ సేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని, వీ బీ -జీ రాంజీ చట్టాన్ని రద్దుచేసి పాత మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని, ఉపాధి హామీలో ఈ – కేవైసీ విధానాన్ని రద్దుచేసి పని ప్రదేశంలో కార్మికులకు తాగడానికి నీళ్లు, నీడ కోసం టెంట్, మెడికల్ కిట్టు, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని, రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు భూమిలేని పేదలకు సంవత్సరానికి 12 వేల రూపాయలు, మహిళలకు ఇస్తానన్న 2500 రూపాయలు, పెన్షన్లు పెంపు, ఇండ్లు, ఇళ్ల స్థలాలు, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పథకం పేరుతో దళితులకు ఇస్తానన్న దళిత 12 లక్షల రూపాయలు ఇవ్వాలని, విద్యా, వైద్యం పేదలందరికీ ఉచితంగా అందించాలని, దళిత వాడలు, గిరిజన తండాలు, కూలీ పేటల అభివృద్ధి ప్రత్యేక నిధులు కేటాయించాలని తీర్మానాలు చేయడం జరిగిందని, ప్రభుత్వం వీటిని అమలు చేయకుంటే పోరాటాలు కొనసాగిస్తామని నర్సింహ తెలియజేశారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!