ePaper
Wednesday, June 17, 2026
📄 ePaper
Homeకుత్బుల్లాపూర్ఈ నెల 7న శ్రీ వేంకటేశ్వరస్వామి కళ్యాణ మహోత్సవం

ఈ నెల 7న శ్రీ వేంకటేశ్వరస్వామి కళ్యాణ మహోత్సవం

📰 Generate e-Paper Clip

మన తొలివెలుగు, కుత్బుల్లాపూర్ ప్రతినిధి టీ. రమేష్ :

శ్రీ అన్నమాచార్య సంగీత నృత్య కళాక్షేత్రం ఆధ్వర్యంలో, ప్రముఖ గాయకుడు, ఆధ్యాత్మిక వేత్త అన్నమయ్య పవన్ ప్రత్యక్ష నిర్వహణలో ఈ నెల 7న కొంపల్లిలోని హమ్స్ తాన్స్ కన్వెన్షన్ లో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి వారి కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించనున్నారు. తిరుమలలో నిర్వహించే వైఖానస ఆగమ సంప్రదాయ పద్ధతిని అనుసరించి ఈ మహోత్సవాన్ని నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో తిరుమల వేద పండితులు, అన్నమయ్య వంశీయులు పాల్గొని ప్రత్యేక పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా అన్నమయ్య పవన్‌ శిష్య బృందానికి చెందిన సుమారు వెయ్యి మంది గాయకులు కలిసి అన్నమయ్య సంకీర్తన “సకల బలంబులు నీవే” ను సహస్ర గళ బృందగానంగా ఆలపించనున్నారు. అలాగే “భజ గోవిందం” భగవన్నామ సంకీర్తన కార్యక్రమం భక్తులకు ప్రత్యేక ఆధ్యాత్మిక అనుభూతిని అందించనుంది. ఆధ్యాత్మికత, సంగీతం, సాంస్కృతిక సంప్రదాయాల సమ్మేళనంగా నిర్వహించనున్న ఈ మహోత్సవానికి భక్తులు, సంగీతాభిమానులు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి ఆశీస్సులు పొందాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమానికి సంబంధించిన వివరాల కోసం 9866695051, 7331126051, 7331127051, 7981052851 నంబర్లలో సంప్రదించవచ్చని తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!