ePaper
Saturday, August 1, 2026
📄 ePaper
Homeతెలంగాణహైదరాబాద్ముందస్తు అడ్మిషన్ల పేరుతో ఇంజనీరింగ్ కాలేజీల్లో కార్పోరేట్ దందా

ముందస్తు అడ్మిషన్ల పేరుతో ఇంజనీరింగ్ కాలేజీల్లో కార్పోరేట్ దందా

📰 Generate e-Paper Clip

పేద విద్యార్థులకు సాంకేతిక విద్య అందని ద్రాక్షగా మారింది

మన తొలివెలుగు, సిటీ బ్యూరో ప్రతినిధి :

 

ఇంజనీరింగ్ కాలేజీల్లో అక్రమ అడ్మిషన్ల దందాతో అణగారిన ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు, ఆర్థికంగా వెనకబడిన విద్యార్థులకు ఇంజనీరింగ్ విద్య ఒక అందని ద్రాక్షగా మారిందని ఎకనామికల్ బ్యాక్వర్డ్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎ. శివకుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాదులోని శ్రీనిధి ఇంజనీరింగ్ కాలేజీ వద్ద రోకో కార్యక్రమంలో భాగంగా వివిధ విద్యార్థి సంఘాలతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాదు నగరంలోని పలు ఇంజినీరింగ్‌ కళాశాలలు నిబంధనలకు విరుద్ధంగా ట్యూషన్‌ ఫీజులు వసూలు చేస్తున్నాయని, అడ్మిషన్స్‌కు సంబంధించిన షెడ్యూల్‌ రాకముందే కొన్ని కాలేజీలు మేనేజ్‌మెంట్‌ కోటా కింద ప్రవేశాలు తీసుకొని రసీదులు ఇవ్వగా, మరికొన్ని మాత్రం ప్రభుత్వ నిర్ణీత ట్యూషన్‌ ఫీజు కన్నా లక్షల్లో అదనంగా గుంజుతున్నాయన్నారు. హైదరాబాదు నగరంలోని ఉన్న ప్రముఖ కళాశాలతో సహా మిగిలిన కాలేజీల్లో నడుస్తున్న ఈ దందా తీరుపై ఉన్నత విద్యా మండలికి ఫిర్యాదులు వెళ్లాయన్నారు. సదరు యాజమాన్యాలు పీఆర్వో వ్యవస్థను ఏర్పాటు చేసుకొని, తిమ్మిని బొమ్మి చేస్తూ అడ్మిషన్లు పొందుతున్నారన్న విమర్శలను ఇప్పటికే ఎదుర్కొంటున్నాయన్నారు. తాజాగా నిబంధనలకు విరుద్ధంగా కాలేజి యాజమాన్యాలు లక్షల్లో వసూలు చేస్తున్నారు అని తెలిపారు. కార్పోరేట్ కళాశాలలు ప్రచారానికి కొత్త పుంతలు తొక్కుతున్నాయని, పీఆర్వోలు రంగంలోకి తెంపుతున్నాయన్నారు. ప్రైవేట్ ఉపాధ్యాయులతో పరిచయాలు పెంచుకొని విద్యార్థుల డేటాను సేకరిస్తున్నారని, ఫోన్ నంబర్లు సంపాదించి నిత్యం కాల్స్‌తో వేధిస్తున్నారన్నారు. అత్యాధునిక మౌలిక సదుపాయాలు ఉన్నట్లుగా కృత్రిమ మేధ ద్వారా సృష్టించిన నకిలీ వీడియోలు, ఆడియోలతో తల్లిదండ్రులను భ్రమింప చేస్తున్నారన్నారు. డాక్టర్లు, ఇంజనీర్లు చేస్తామంటూ నకిలీ ర్యాంకుల బోర్డులతో విద్యార్థులను ఆకర్షిస్తున్నారని ఆరోపించారు. అడ్మిషన్‌, లైబ్రరీ, ల్యాబ్‌, యూనివర్సిటీ ఫీజులంటూ అధికంగా ముక్కుపిండి వసూలు చేస్తున్నారన్నారు. మరీ దారుణమైన విషయం ఏంటంటే ఆన్‌లైన్‌లో అయితే అస్సలు అంగీకరించం నగదు అయితేనే తీసుకుంటామనీ ప్రవేట్ కళాశాలలో షరతులు విధించడం వెనక ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు . కొన్ని కాలేజీలు అయితే సీటు వచ్చిన విద్యార్థులకు ఫోన్లు చేసి ఇంత ఫీజు తీసుకురండి అంటూ ముందస్తు సమాచారాన్నిస్తున్నాయని తెలిపారు. ఓ కాలేజీ మరీ బరితెగించిందని, విద్యార్థి అడ్మిషన్‌ కోసం వెళితే ఫీజు కట్టాల్సిందేనంటూ చెప్పేసింది.. అయ్యో నాకు తెలియదు నేను అంత కట్టలేను అంటే ఫీజు కడితేనే కన్ఫర్మ్‌ చేస్తాం అంటూ హెచ్చరించిందన్నారు. మీ తల్లిదండ్రులకు ఫోన్‌ చేసి పోన్‌ ఫే ద్వారా చెల్లించండి అంటూ ఆప్షన్‌ ఇచ్చింది. విధిలేక కాలేజీ చెప్పినంత ఫీజును చెల్లించాల్సి వచ్చింది. అంత కట్టినా కూడా యూనివర్సిటీకి వెళ్తే అక్కడ విద్యార్థి కావాల్సిన మౌలిక వసతులు ఏమాత్రం సరిగా ఉండడం లేదన్నారు. పైన పటారం లోపల లొటారం లాగా ఉంటుందన్నారు. నిరుపేద విద్యార్థులకు ఇంజనీరింగ్ విద్య అనేది ఒక అందని ద్రాక్షగా మారిందని తెలిపారు. డబ్బున్న వాళ్లకి అంగట్లో సరుకులు లాగా అడ్మిషన్లను విక్రయించడం మానుకోవాలని డిమాండ్ చేశారు. ఇలా ఉన్నవాళ్లకు అమ్ముకుంటూ పోతే పేద విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!