మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య ముదిరాజ్
కేవలం 2 చుక్కలు జీవితాంతం పోలియో నుంచి రక్షణ లభిస్తుందని నాయకులు బొర్ర జగన్ రెడ్డి, దండు గణేష్ ముదిరాజ్ అన్నారు. మల్లాపూర్ లో వారు చిన్నారులకు పోలియో డ్రాప్స్ వేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పసిపిల్లలకు ప్రాణాంతక వ్యాధుల నుంచి రక్షణ కల్పించడానికి దేశాన్ని పోలియో రహితంగా ఉంచడానికి పోలియో చుక్కలు వేయించాలన్నారు. పిల్లలను ప్రాణాంతకమైన పోలియో వ్యాధి (పక్షవాతం) బారి నుంచి రక్షించి, భవిష్యత్తులో ఈ మహమ్మారిని సమాజం నుంచి పూర్తిగా నిర్మూలించడానికి పోలియో చుక్కలు వేయిస్తారు కావున ప్రతి ఒక్కరు తమ తమ పిల్లలకు తప్పనిసరిగా వేయించాలని కోరారు.

