దేవరకొండలో సేవా కార్యక్రమాలతో ఘనంగా సంబరాలు
మన తొలివెలుగు, తెలంగాణ బ్యూరో ప్రతినిధి సాయి కిషోర్ కనుగుల :
బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని దేవరకొండలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సేవా కార్యక్రమాలతో ఘనంగా వేడుకలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ నాయక్, సీనియర్ నాయకులు వాజిద్ పాషా ముఖ్య అతిథులుగా హాజరై కేక్ కటింగ్ చేసి సంబరాలు చేసిన అనంతరం కార్యకర్తలు కేటీఆర్ ఫ్లెక్సీలకు పాలాభిషేకం చేశారు. కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ మాట్లాడుతూ.. కేటీఆర్ నాయకత్వంలో తెలంగాణ సాధించిన అభివృద్ధి అందరికీ తెలుసన్నారు. ఐటీ, పరిశ్రమలు, యువతకు ఉద్యోగాల్లో ఆయన పాత్ర కీలకమన్నారు. యువతకు ఆయన స్ఫూర్తి అని అన్నారు. సీనియర్ నాయకులు వాజిద్ పాషా మాట్లాడుతూ.. కేటీఆర్ యువతకు ఆదర్శమని, తెలంగాణ అభివృద్ధిలో ఆయన పాత్ర మరువలేనిదని, కేసీఆర్ నాయకత్వంలో, కేటీఆర్ కృషితో బీఆర్ఎస్ పార్టీ మరింత బలంగా ముందుకు సాగుతుంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు, మండల అధ్యక్షులు, కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

