ePaper
Sunday, August 16, 2026
📄 ePaper
Homeతెలంగాణహైదరాబాద్ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం ఎగరాలి 

ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం ఎగరాలి 

📰 Generate e-Paper Clip

ప్రతి ఒక్కరిలో దేశభక్తి నింపాలి 

బీజేపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ జూటూరు కీర్తి రెడ్డి

మన తొలివెలుగు సిటీబ్యూరో :

ప్రధాని మోదీ హర్ ఘర్ తిరంగా పిలుపు మేరకు బుధవారం హైదరాబాద్ జుబ్లీహిల్స్ లోని తమ ఇంటిపై బీజేపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ జూటూరు కీర్తి రెడ్డి జాతీయ జెండా ఎగురవేసిన వేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. స్వాతంత్ర పోరాటాన్ని స్మరించుకుంటూ ప్రతి ఒక్కరిలో దేశభక్తిని నింపాలని, ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం రెపరెపలాడడాలని పిలుపునిచ్చారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ ”హారఘర్ తిరంగా” పిలుపు మేరకు బుధవారం హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని తన ఇంటిపై జాతీయ జెండా ఎగురవేశారు. ప్రతి ఒక్కరు కూడా బాధ్యతాయుతంగా తమ తమ ఇళ్ల పై జాతీయ జెండా ఎగురా వేయాలని కోరారు. దేశ స్వతంత్రం కోసం పోరాడిన సమర యోధులను మనమంతా స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ దేశ యువత దేశం ఫస్ట్.. అన్ని తరువాత అనేలా.. సగర్వంగా త్రివర్ణ పథకాన్ని భుజాన వేసుకోవాలన్నారు. అవసరమైనప్పుడు ఈ దేశం కోసం మేమున్నామని అండగా నిలబడాలన్నారు. ప్రధాని పిలుపు మేరకు ప్రతి కార్యకర్త కూడా తమ తమ ఇళ్లపై ఈ జాతీయ జెండా ఎగుర వేయాలన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!