మాజీ కార్పొరేటర్ కంపు రాజకీయాలు..!?
చెత్త వసూళ్లలో తన పేరు బయటికి రావడంతో బెంబేలు..!
ట్రాక్టర్ డ్రైవర్ ని ఒత్తిడి చేసి వీడియో రిలీజ్..?
ట్రాక్టర్ డ్రైవర్ నోట్లో మట్టి..!
కాలనీ వాసులు తీసిన వీడియో మార్ఫింగ్ అంటూ బుకాయింపు
నిజాలు రాస్తే భుజాలు తడుముకున్న కొప్పుల..!
ఆటోనగర్ డంపింగ్ యార్డ్ కేంద్రంగా రాజకీయ దుమారం
కాలనీవాసులు రిలీజ్ చేసిన వీడియో
మన తొలివెలుగు | ఎల్బీనగర్ :
ఎల్బీనగర్ నియోజకవర్గంలోని మన్సూరాబాద్ పరిధిలో ఉన్న ఆటోనగర్ డంపింగ్ యార్డ్ మరోసారి రాజకీయ వివాదానికి కేంద్రంగా మారింది. చెత్త సమస్య చుట్టూ స్థానిక రాజకీయాలు వేడెక్కగా, మాజీ కార్పొరేటర్ వ్యవహారశైలిపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చెత్త , బిల్డింగ్ మెటీరియల్ వ్యర్ధాల తరలింపులో మాజీ కార్పొరేటర్ వసూలు వ్యవహారంపై ఆరోపణలు రావడంతో రావడంతో ఈ వివాదం మరింత ముదిరిందనే చర్చ జరుగుతుంది. కాలనీవాసుల వీడియోలపై వివాదం చెలరేగుతోంది. డంపింగ్ యార్డ్కు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చర్చకు రావడంతో వివాదం కొత్త మలుపు తిరిగింది.
వీడియోలు మార్ఫింగ్ అంటూ బొకాయింపు..!
చెత్త (బిల్డింగ్ మెటీరియల్ వ్యర్ధాల) తరలిస్తున్న ట్రాక్టర్ ను స్థానికులు అడ్డుకున్నారు. కాలనీలలో చెత్త డంపింగ్ విషయంపై డ్రైవర్ని నిలదీశారు. దీంతో డ్రైవర్ మాజీ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి పేరును ప్రస్తావించారు. ఈ వ్యవహారాన్ని కాలనీవాసులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో చెత్త వ్యవహారం వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఆ వీడియోలు మార్ఫింగ్ అంటూ మాజీ కార్పొరేటర్ భజన బృందం బుకాయించడం కోసం మెరుపు.
కొప్పుల వర్గం రిలీజ్ చేసిన మార్ఫింగ్ వీస్పష్టంగా
ఈ వీడియో చూడండి.. ట్రాక్టర్ డ్రైవర్ పై ఒత్తిడి చేసి వీడియో తీసి రిలీజ్ చేసినట్లు స్పష్టంగా అర్థం అవుతుంది.
ట్రాక్టర్ డ్రైవర్ తో మరో వీడియో రిలీజ్..?
గుమ్మడికాయ దొంగ.. భుజాలు తరుముకున్నట్టు.. చెత్త వసూళ్లలో తన పేరు బయటికి రావడంతో బెంబేలెత్తిపోయిన మాజీ కార్పొరేటర్ ట్రాక్టర్ డ్రైవర్ తో మరో వీడియో రిలీజ్ చేయించినట్లు కాలనీవాసులు ఆరోపిస్తున్నారు. పలు కాలనీల నుంచి సేకరించిన భవన నిర్మాణ వ్యర్ధాలను కాలనీలో వేస్తూ ఉంటే.. అడ్డుకోవడంతో కొప్పుల నరసింహారెడ్డి పేరును ట్రాక్టర్ డ్రైవర్ ప్రస్తావించినట్టు కాలనీవాసులు వీడియో ఆధారాలతో బయట పెట్టారు. అయితే ఈ వివాదంలో ట్రాక్టర్ డ్రైవర్ పాత్ర కూడా చర్చనీయాంశంగా మారింది. డ్రైవర్పై ఒత్తిడి తెచ్చి వీడియో విడుదల చేశారని కాలనీవాసులు పేర్కొంటున్నారు.
చెత్త సమస్యకు పరిష్కారం ఎప్పుడు?
ఆటోనగర్ డంపింగ్ యార్డ్ చుట్టూ నెలకొన్న వివాదం రాజకీయ ఆరోపణలు, ప్రత్యారోపణలకే పరిమితం కాకుండా ప్రజల సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. చెత్త నిర్వహణ, పరిసరాల పరిశుభ్రత, కాలనీవాసుల ఇబ్బందులపై అధికారులు స్పష్టమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. రాజకీయ విమర్శలు పక్కనపెట్టి.. డంపింగ్ యార్డ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతారా? లేక ఆరోపణలు, ప్రత్యారోపణలతోనే కాలం గడుపుతారా? అన్నది వేచి చూడాలి.

