ePaper
Friday, October 16, 2026
📄 ePaper
Homeఎల్బీనగర్ఫతుల్లగూడ కాలనీ సమస్యలు పరిష్కరించండి

ఫతుల్లగూడ కాలనీ సమస్యలు పరిష్కరించండి

📰 Generate e-Paper Clip

మల్కాజ్ గిరి మున్సిపల్ కమిషనర్‌కు సోషల్ జస్టిస్ పార్టీ నేతల వినతి

బస్తీ దర్బార్‌లో వెలుగుచూసిన సమస్యలను కమిషనర్ దృష్టికి తీసుకెళ్లిన నాయకులు

మన తొలివెలుగు | ఎల్బీనగర్:

ఎల్బీనగర్ నియోజకవర్గంలోని ఉప్పల్ రెవెన్యూ పరిధి ఫతుల్లగూడ సర్వే నంబర్‌ 58లోని డీఎస్‌ఆర్ నగర్ కాలనీలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సోషల్ జస్టిస్ పార్టీ దివ్యాంగ విభాగం అధ్యక్షుడు ఎం. సైదులు యాదవ్, అధికార ప్రతినిధి చిత్తలూరి వేణు కోరారు. ఈ మేరకు మల్కాజిగిరి మున్సిపల్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డిని శుక్రవారం ఆయన కార్యాలయంలో కలిసి వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. డీఎస్‌ఆర్ నగర్‌లో సోషల్ జస్టిస్ పార్టీ ఆధ్వర్యంలో గత మంగళవారం నిర్వహించిన బస్తీ దర్బార్‌లో స్థానికులు పలు సమస్యలను తమ దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు. వాటి పరిష్కారానికి అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని కోరుతూ కమిషనర్‌కు వివరించారు. కాలనీలో కమ్యూనిటీ హాల్ కోసం కేటాయించిన స్థలం కబ్జాకు గురవుతోందని, దానిని పరిరక్షించేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని వారు కోరారు. బస్తీ ప్రజల వైద్య అవసరాలను దృష్టిలో ఉంచుకుని బస్తీ ఆసుపత్రి నిర్మాణాన్ని చేపట్టాలని, అసంపూర్తిగా ఉన్న రహదారులను పూర్తిస్థాయిలో నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా అంగన్‌వాడీ కేంద్రం నిర్మాణ పనులను ప్రారంభించి, చిన్నారులు, మహిళలకు అవసరమైన సేవలు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు.

కాలనీలోని ప్రభుత్వ స్థలాలను పరిరక్షించడంతో పాటు, వాటిని ప్రజా అవసరాలకు వినియోగించేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని నాయకులు సూచించారు. స్థానికుల ఆరోగ్యం, వ్యాయామ అవసరాల కోసం కాలనీలో ఓపెన్ జిమ్‌ను ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్న విషయాన్ని కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు.

బస్తీ దర్బార్‌లో వెలుగుచూసిన సమస్యలపై అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి, కాలనీవాసులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని సోషల్ జస్టిస్ పార్టీ నాయకులు విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!