ePaper
Wednesday, September 16, 2026
📄 ePaper
Homeఎల్బీనగర్అక్ర‌మ‌ నిర్మాణదారుల త‌రుపున ఓ బీజేపీ నేత బ్రోక‌రిజం..!

అక్ర‌మ‌ నిర్మాణదారుల త‌రుపున ఓ బీజేపీ నేత బ్రోక‌రిజం..!

📰 Generate e-Paper Clip

మన తొలివెలుగు (2026 జులై 28) ఎల్బీన‌గ‌ర్ :

 

హ‌య‌త్‌న‌గ‌ర్ స‌ర్కిల్ ప‌రిధిలో స్థానిక బీజేపీ నేత ఒక‌రు అక్ర‌మ నిర్మాణదాల‌ త‌రుపున బ్రోక‌ర్‌గా మారాడు..! ఈ స‌దురు కాషాయ నేత అక్ర‌మ నిర్మాణ‌దారుల‌కు టౌన్‌ప్లానింగ్ అధికారుల‌కు మ‌ధ్య‌వ‌ర్తిగా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. ఈయ‌న గారు అంద‌రినీ.. అంటే అటు అధికారుల‌ను ఇటు అన‌ధికారుల‌ను కూడా మానేజ్ చేస్తూ.. తానూ నాలుగు రాళ్లు వెన‌కేసుకుంటున్నాడు. హ‌య‌త్‌న‌గ‌ర్ కెప్టెన్ కుక్ హోట‌ల్ ప‌క్క‌న జ‌రుగుతున్న అక్ర‌మ నిర్మాణ‌మే ఇందుకు సాక్షం. అందుకే టౌన్ ప్లానింగ్ ఏసీపీ విజయలక్ష్మి ఆ అక్ర‌మ నిర్మాణంపై ఎటుంటి చ‌ర్య‌లు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందని స్థానికులు వాపోతున్నారు. అయితే ఈయ‌న‌ గారు హ‌య‌త్‌న‌గ‌ర్‌ తాజా మాజీ కార్పొరేట‌ర్‌ను సైతం లేక్క‌చేయ‌డంలేద‌ని స‌మాచారం. ఇక అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తూ బ్రోకర్ అవుతారం ఎత్తిన స్థానిక బీజేపీ నాయకుడిపై పార్టీ రాష్ట్ర నాయకత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి మరి..!

 

త్వ‌ర‌లో పూర్తి క‌థ‌నంతో.. మీ ముందుకు

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!