ePaper
Wednesday, September 16, 2026
📄 ePaper
Homeయాదాద్రి భువనగిరి జిల్లాజిల్లా అదనపు కలెక్టర్, జిల్లా సంక్షేమ అధికారి ని కలిసిన "ఉదయ్" కమిటీ సభ్యులు

జిల్లా అదనపు కలెక్టర్, జిల్లా సంక్షేమ అధికారి ని కలిసిన “ఉదయ్” కమిటీ సభ్యులు

📰 Generate e-Paper Clip

సమస్యలు పరిష్కరించాలని అదనపు కలెక్టర్ కు వినతి

మన తొలి వెలుగు, యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో ప్రతినిధి జంగిటి రవీందర్

యాదాద్రి భువనగిరి జిల్లాలోని వికలాంగులకు ఉద్యోగ రిజర్వేషన్లు, హక్కులు, రక్షణ కల్పించాలని కోరుతూ శుక్రవారం జిల్లా అదనపు కలెక్టర్ వెంకారెడ్డి, జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ శాఖ అధికారి నర్సింహారావులను వేరు వేరుగా కలిసి వినతిపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఉదయ్ కమిటీ రాష్ట్ర అద్యక్షులు ఎం. శ్రీనివాసులు మాట్లాడుతూ.. బ్యాక్ లాగ్ పోస్టులు భర్తీ చేయాలని, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల్లో వికలాంగులకు 4 శాతం రిజర్వేషన్లు పక్కాగా అమలు చేయాలని, ప్రైవేటు సంస్థల సీఎస్ఆర్ ( కార్పోరల్ సోషల్ రెస్పాన్సిబిలిటీ) నిధులను దివ్యాంగుల స్వయం ఉపాధికి ఉపయోగించాలని కోరారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీరేష్ మాట్లాడుతూ.. ప్రభుత్వ, ప్రైవేటు భవనాల ప్రధాన ద్వారం వద్ద ర్యాంపులు, లిఫ్టులు ఏర్పాటు చేయాలని, దివ్యాంగుల కొరకు ప్రతి వారం ప్రత్యేక ప్రజావాణి ( గ్రీవెన్స్ డే) నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంస్థ రాష్ట్ర కమిటీ సభ్యులు, కుమార్ మల్లు, రంగారెడ్డి జిల్లా జనరల్ సెక్రటరీ అంజి గౌడ్, హైదరాబాద్ వైస్ ప్రెసిడెంట్ వెంకట్ రెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లా నూతన అధ్యక్షులు జి. స్వామి, ప్రధాన కార్యదర్శి ఎస్ వెంకటేష్, వైస్ ప్రెసిడెంట్స్ ఏ. గోపాల్, ఆర్ వెంకటేష్, కోశాధికారి సత్యనారాయణ, కార్యవర్గం సభ్యులు మహేష్, రాజేష్, వెంకటేష్, మల్లారెడ్డి, సిద్దార్థ్ నాయక్, సీ.హెచ్ శివ, సాయి కుమార్, బాలరాజు, జయరాజ్ పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!