ePaper
Wednesday, September 16, 2026
📄 ePaper
Homeక్రైమ్ న్యూస్డ్రగ్స్ అమ్ముతున్న ఇద్దరు వ్యక్తుల అరెస్టు

డ్రగ్స్ అమ్ముతున్న ఇద్దరు వ్యక్తుల అరెస్టు

📰 Generate e-Paper Clip

మన తొలివెలుగు, యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో ప్రతినిధి జంగిటి రవీందర్

డ్రగ్స్ అమ్ముతున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు పట్టణ సీఐ రమేష్ తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం విశ్వసనీయ సమాచారం మేరకు ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో డ్రగ్స్ అమ్ముతున్నారని తెలియడంతో ఎస్సై లక్ష్మీనరసయ్య, సిబ్బందితో కలిసి తనిఖీలు నిర్వహించారు. ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుచుండగా వారిని ఆపి ప్రశ్నించారు. వారి పేర్లు వెస్ట్ బెంగాల్ మాల్దా జిల్లా కు చెందిన హబీబుర్రహ్మాన్ (48), ఎస్.కె. ఖాదిర్ (30) అని తెలిపారని చెప్పారు. వారి వద్ద 50 గ్రాములు బ్రౌన్ షుగర్ ను సీజ్ చేయడం జరిగిందని దీని విలువ సుమారు 5 లక్షలు ఉంటుందని వివరించారు . దీనిని పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ బార్డర్ వద్ద గల మాల్దా జిల్లా నుంచి తీసుకువచ్చి ఇక్కడ అధిక లాభాలకు అమ్ముతున్నారని తెలుస్తుందన్నారు. నిందితులను రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!