ePaper
Friday, September 18, 2026
📄 ePaper
Homeతెలంగాణరంగారెడ్డిపేదల సొంతింటి కలను నెరవేరుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం

పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం

📰 Generate e-Paper Clip

మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య 

పేదలకు గృహకల్పన ధ్యేయంగా, లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వ పనిచేస్తూ పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్నదని కందుకూరు మండల మాజీ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఢిల్లీ శ్రీధర్ ముదిరాజ్ , లేమూర్ గ్రామ శాఖ అధ్యక్షుడు మహమ్మద్ రహీమ్ అన్నారు. కందుకూరు మండల పరిధిలోని లే్మూర్ గ్రామం లో ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశం చేశారు. లేమూర్ గ్రామానికి చెందిన గంగరి సోని శ్రీనివాస్ ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం కార్యక్రమానికి లే్మూర్ గ్రామ ఇందిరమ్మ కమిటీ మెంబర్స్ మూల ఇంద్రారెడ్డి, మంచాల భాస్కర్, గుల్వి దేవేందర్ తదితరులతో కలిసి నూతన ఇంటికి రిబ్బన్ కట్ చేసి గృహప్రవేశం చేయించారు. గ్రామం లో గృహప్రవేశం చేసిన దంపతులకు మాజీ సర్పంచ్ గూడూరు కొండారెడ్డి సహకారంతో నూతన వస్త్రాలు వారికి బహుకరించడం జరిగింది.

ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. పేద ప్రజల సొంతింటి కల ప్రజా పాలనలో సీఎం రేవంత్ రెడ్డితో సాధ్యమైనదన్నారు. నిరుపేద ప్రజలు ఆత్మగౌరవంతో జీవించే విధంగా ఇందిరమ్మ రాజ్యం ఏర్పడిందన్నారు. పేదల కళ్ళలో సంతోషం కనిపిస్తుంది అన్నారు. నియోజవర్గ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి సహకారంతో అభివృద్ధితో పాటు పేదలకు ఇంటి నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయన్నారు. ఈ కార్యక్రమం లో యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మంచాల రాజేష్, బూత్ కమిటీ మెంబర్ అఖిల్, అహ్మద్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు డప్పు పోచయ్య, గుర్రం సత్తయ్య, చిన్నగాళ్ల రాజభూషణం, జంగిలి బన్నీ, గంగరి యాదయ్య, సురేష్ లక్ష్మయ్య, రవీందర్, మంచాల లక్ష్మయ్య , కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!