ePaper
Wednesday, September 16, 2026
📄 ePaper
Homeతెలంగాణరంగారెడ్డిబాధితురాలికి న్యాయం జరిగేలా ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించాలి - సునీత బాలరాజ్

బాధితురాలికి న్యాయం జరిగేలా ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించాలి – సునీత బాలరాజ్

📰 Generate e-Paper Clip

మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య

 

అత్యాచారాలు, మహిళలపై దాడుల విషయంలో నిందితులు ఎంతటి వారైనా, ఎంతటి ప్రభావశీలురైనా ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలనీ మీర్ పేట్ బీఆర్ఎస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు సునీత బాలరాజ్ డిమాండ్ చేశారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు 17 సంవత్సరాల బాలికకు ఆల్కహాల్ తాగించి హైదరాబాద్ మొయినాబాద్ ఫామ్‌హౌస్‌తో పాటు మరో రెండు ప్రాంతాల్లో అత్యాచారానికి పాల్పడ్డాడని ఆరోపణ సందర్భంలో మైనర్ బాలికపై దారుణ ఘటనకు నిరసనగా మీర్ పేట్ బీఆర్ఎస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు సునీత బాలరాజ్ ఆధ్వర్యంలో ప్రశాంతి హిల్స్ డివిజన్ లో ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల చోటు చేసుకున్న ఒక దారుణ ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నుంచి తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోందన్నారు. ఒక మైనర్ బాలికపై జరిగిన అత్యాచార ఘటన మహిళా సంఘాలు, ప్రజాసంఘాలు, సామాజిక వర్గాలను కలవరపరుస్తోందని పేర్కొన్నారు. ఈ ఘటనలో ప్రభావశీల రాజకీయ కుటుంబానికి చెందిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు పై ఆరోపణలు రావడం మరింత ఆందోళన కలిగించే విషయమన్నారు. కేంద్రం మంత్రి అంటేనే బాధ్యతగా జవాబుదారితనం ఉండాలన్నారు. ప్రజలను రక్షించే వాళ్లే భక్షిస్తే ఎలా ఉంటుంది. ఇలాంటి రాజకీయ నాయకులకు సిగ్గుండాలి. రాజకీయ ప్రభావాలు, అధికార దుర్వినియోగం చోటు చేసుకుంటున్నాయనే అనుమానాలు ప్రజల్లో పెరుగుతున్నాయని తెలిపారు. ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు ఎవరినైనా కాపాడే ప్రయత్నం చేయకుండా బాధితురాలికి న్యాయం జరిగేలా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు. తప్పు చేసిన వారు ఎవరైనా, ఎంత పెద్ద నాయకుల కుటుంబాలకు చెందిన వారైనా చట్టం ముందు సమానమే కావాలని అన్నారు. మహిళల భద్రత విషయంలో రాజకీయాలకు అతీతంగా న్యాయం ప్రధానంగా నిలవాలని పేర్కొన్నారు. మహిళలపై దాడులు, చిన్నారులపై అత్యాచారాలు జరిగితే సమాజం మొత్తం బాధ్యతగా స్పందించాల్సిన అవసరం ఉందన్నారు.
తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకు సాగాలంటే మహిళలకు భద్రత, ప్రజలకు న్యాయం, చట్టంపై విశ్వాసం బలపడాలని తెలిపారు. ప్రజల నమ్మకాన్ని దెబ్బతీసే విధంగా ప్రభుత్వాలు వ్యవహరించకూడదన్నారు. ఈ సందర్భంగా మహిళా సంఘాలు, ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీల మహిళా నాయకులు ముందుకు వచ్చి బాధితురాలికి మద్దతుగా నిలవాలని కోరారు. ఒక సామాన్య కుటుంబానికి చెందిన మైనర్ బాలికకు కూడా న్యాయం జరిగేలా ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించి, బాధ్యులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో శీను నాయక్, అనిల్ కుమార్ యాదవ్, సిద్దాల అంజయ్య, గోపి యాదవ్, జగల్ రెడ్డి, సింగం రాజు, పద్మ, సుజాత, మాధవి, రాధా, లక్ష్మి, సహస్ర, బుచ్చమ్మ, రాధిక, సుప్రియ, మణెమ్మ, అంజలి, సుజన్య తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!