ePaper
Friday, September 18, 2026
📄 ePaper
Homeయాదాద్రి భువనగిరి జిల్లాభువనగిరిలో 2కే రన్ - యోగ 

భువనగిరిలో 2కే రన్ – యోగ 

📰 Generate e-Paper Clip

మన తొలివెలుగు, యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో ప్రతినిధి జంగిటి రవీందర్ 

ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక యువజన క్రీడలు వారోత్సవాలు లో బాగంగా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో మొదటి రోజు సోమవారం భువనగిరిలో 2కే రన్, యోగా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిదిగా మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పోతంశెట్టి మంజుల, జిల్లా పరిషత్ డిప్యూటీ సి.ఇ.ఓ. శ్రీనివాస్, భువనగిరి ఎంపీడీఓ దినకర్, జిల్లా యువజన, క్రీడల అధికారి కే. ధనంజనేయులు, డీఐఈఓ సురేష్ రెడ్డి పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. 2కే రన్ ప్రభుత్వ జూనియర్ కళాశాల నుండి పోస్ట్ ఆఫీస్ వరకు కొనసాగింది. జిల్లా యువజన క్రీడల అధికారి కే. ధనంజనేయులు మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక లో భాగం గా యువజన క్రీడల వారోత్సవాలు ఈ నెల 18 నుండి 23 వరకు జరుగుతాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సి.ఇ.ఓ. శ్రీనివాస్, అథ్లెటెక్ అసోసెషన్ ప్రెసిడెంట్ పోతంశెట్టి వెంకటేశ్వర్లు, యువజన సంఘాల అధ్యక్షులు సరగడ కరుణ్, జూడో ఫర్వేజ్, కృష్ణ, రాధా, కుమార్, రమేష్, ఎం. రాజేందర్, జె.సందీప్, గోపాల్, క్రీడాకారులు, సిబ్బంది జానకి రాములు మురళి, రేఖ, జయ, రాజశేఖర్, రేణుక శ్రీనివాస్ పాల్గొన్నారు.

అనంతరం కలెక్టరేట్ లో టూరిజం గైడ్ పోస్టర్ ను జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, జిల్లా అడిషనల్ కలెక్టర్ ఏ.భాస్కర్ రావు, జిల్లా అడిషనల్ కలెక్టర్ వెంక రెడ్డి ఆవిష్కరించారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!