ePaper
Monday, May 4, 2026
📄 ePaper
Homeతెలంగాణరంగారెడ్డిశ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయ ప్రారంభోత్సవ వేడుకల్లో పాల్గొన్న అందెల శ్రీరాములు, కొలన్...

శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయ ప్రారంభోత్సవ వేడుకల్లో పాల్గొన్న అందెల శ్రీరాములు, కొలన్ శంకర్ రెడ్డి

📰 Generate e-Paper Clip

మన తెలివెలుగు ,మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య

వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దయతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని మహేశ్వరం నియోజకవర్గ బీజేపీ ఇంచార్జ్ అందెల శ్రీరాములు, రాష్ట్ర కో ఆపరేటివ్ సెల్ అధ్యక్షుడు కొలను శంకర్ రెడ్డి అన్నారు.

మహేశ్వరం నియోజకవర్గం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మీర్ పేట్ డివిజన్లోని దీన్ దయాల్ నగర్ లో నూతనంగా నిర్మించిన వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయ ప్రారంభోత్సవ వేడుకల్లో వారు హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులందరూ కలిసి శ్రీరాములు ని, కొలన్ శంకర్ రెడ్డిని ఘనంగా సత్కరించారు.

ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ తేరటిపల్లి శ్రీనివాస్ గుప్తా, అధ్యక్షుడు పచ్చిపులుసు శ్రీరామచంద్రమూర్తి గుప్తా, ప్రధాన కార్యదర్శి ఇరువెంటి సురేష్ గుప్తా, కోశాధికారి గందె వెంకటేశ్వర్లు గుప్తా, కమిటీ సభ్యులు, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి దేవేందర్ రెడ్డి, మద్ది రాజశేఖర్ రెడ్డి, బీజేపీ అధ్యక్షుడు ముఖేష్ ముదిరాజ్, పసునూరి బిక్షపతి చారి, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, మాజీ కార్పొరేటర్లు, బీజేవైఎం నాయకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!