ePaper
Wednesday, June 17, 2026
📄 ePaper
Homeమహేశ్వరంబడంగ్‌పేట్ లైబ్రరీలో సమస్యలు పరిష్కరించాలి 

బడంగ్‌పేట్ లైబ్రరీలో సమస్యలు పరిష్కరించాలి 

📰 Generate e-Paper Clip

డిప్యూటీ కమిషనర్ కు వినతి

మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య 

బడంగ్‌పేట్ లోని రంగారెడ్డి జిల్లా లైబ్రరీలో సమస్యలను పరిష్కరించాలని నవ తెలంగాణ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో డిప్యూటీ కమిషనర్ సమ్మయ్యను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థి నాయకులు మాట్లాడుతూ.. బడంగ్‌పేట్ లైబ్రరీలో ఇందిరమ్మ క్యాంటీన్, వాటర్ ఫిల్టర్, ముఖ్యంగా డ్రెనేజీ సమస్యలు ఉన్న నేపథ్యంలో వాటిని వెంటనే పరిష్కరించాలని డిప్యూటీకమిషనర్ ను కోరడం జరిగిందన్నారు. ఈ సమస్యలపై స్పందించిన డిప్యూటీ కమిషనర్ సమ్మయ్య, ఏఈ హరీష్ కి వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం ఏఈ హరీష్ బడంగ్‌పేట్ లైబ్రరీని సందర్శించి డ్రెయినేజీ సమస్యను పరిశీలించి, శాశ్వత పరిష్కారం కల్పిస్తామని హామీ ఇచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో నవ తెలంగాణ విద్యార్థి పరిషత్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సూర్ణగంటి రంజిత్ కుమార్, ప్రొగ్రెసివ్ యూత్ లీగ్ హైదరాబాద్ నగర కార్యదర్శి కొల్లూర్ బీమేశ్, క్రిష్ణ (కిట్టు), నర్సింహ గౌడ్, రమేష్, మనోజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!