డిప్యూటీ కమిషనర్ వెంకట్రావు
మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య ముదిరాజ్ :
పర్యావరణాన్ని కాపాడుకుంటేనే మన భవిష్యత్తు భద్రంగా ఉంటుందని, అకాల వర్షాలు, తీవ్రమైన వేడిగాలులు ప్రకృతి విధ్వంసానికి సంకేతాలని జల్ పల్లి మున్సిపాలిటీ డిప్యూటీ కమిషనర్ వెంకట్రావు అన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలోని 65వ వార్డులోని జల్ పల్లి ప్రభుత్వ స్కూల్ లో డిప్యూటీ కమిషనర్ వెంకట్రావు మొక్కలు నాటి నీరు పోశారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగానే కాకుండా సమయం కుదిరినప్పుడల్లా ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్క నాటి, వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. మానవ మనుగడకు మొక్కలు ఎంతో అవసరమన్నారు. మొక్కలు మనకు ఆహారం, గాలి, నీరు మంచి వాతావరణాన్ని అందిస్తాయన్నారు. మొక్కలు మనకెంతో మేలు చేస్తాయన్నారు. మనం తినే ఆహారం, పీల్చే గాలి, మన ఆరోగ్యం, ఆనందం, శ్రేయస్సు కోసం ప్రకృతిపై ఆధారపడి ఉంటామన్నారు. ప్రకృతి మన జీవనానికి ఎంతో అవసరం. మొక్కలు జంతువులు , ఇతర జీవులు పర్యావరణ వ్యవస్థలో ముఖ్యమైన భాగాలు. వాటిని రక్షించడం ద్వారా మనం పర్యావరణ వ్యవస్థ సమతుల్యతను కాపాడుకోవచ్చు అన్నారు. పర్యావరణం మనిషి మనుగడకు ఎంతో అవసరం. మనం ఆరోగ్యంగా, ఆనందంగా జీవించాలంటే పర్యావరణాన్ని కాపాడుకోవాలన్నారు. కానీ మనం చేతులారా వాతావరణాన్ని కాలుష్యం చేస్తున్నామని నీరు, భూమి, గాలి అన్నీ కాలుష్యంగా మారి అనేక రోగాల బారిన పడుతున్నామన్నారు. ఈ కాలుష్య సమస్యల నుండి వాతావరణాన్ని కాపాడడం తన బాధ్యతగా భావించి ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడం అలవాటు చేసుకోవాలి. ప్లాస్టిక్ కవర్ల వాడకాన్ని తగ్గించుకోవాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, సూపర్వైజర్ కుమార్, పారిశుద్ధ్య కార్మికులు జనార్దన్, లలిత, అరుణ, శాంత, ఆటో డ్రైవర్ సిహెచ్ .నరేందర్ తదితరులు పాల్గొన్నారు.

