ePaper
Wednesday, June 17, 2026
📄 ePaper
Homeమహేశ్వరంజిల్లెలగూడ చందన చెరువును డంపింగ్ యార్డ్ గా మార్చారు

జిల్లెలగూడ చందన చెరువును డంపింగ్ యార్డ్ గా మార్చారు

📰 Generate e-Paper Clip

మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య ముదిరాజ్ :

చందన చెరువును జీహెచ్ఎంసీ అధికారులు డంపింగ్ యార్డ్ గా మార్చారని మీర్ పేట్ మాజీ బీ.ఆర్.ఎస్ పార్టీ అధ్యక్షుడు ఆర్కల కామేష్ రెడ్డి మండిపడ్డారు. జీ హెచ్ఎంసీ బడంగ్ పేట్ సర్కిల్ – 16 పరిధిలోని జిల్లెలగూడ చందన చెరువు చుట్టు ప్రక్కల కాలనీ వాసులు అక్కడికి వచ్చే మార్నింగ్ వాకర్స్ చేసిన విజ్ఞప్తి మేరకు ఆయన చెరువును సందర్శించారు. చెరువులో నుండి తీసిన గుర్రపు డెక్కను తీసే కార్యక్రమాన్ని గత నెల రోజుల క్రితం నుండి చేపడుతున్న పనుల్లో భాగంగా వాకింగ్ చేసే వాకర్స్ ట్రాక్ పైన వేశారన్నారు. తీసిన గుర్రపు డెక్కను తరలించలేదని, ఎక్కడ వేసిన గొంగడి అక్కడ అన్న చందంగా.. చెరువులో నుండి తీసి పక్కకు పోసి తరలించకుండా వదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.బీ ఆర్ ఎస్ పార్టీ నాయకులు పోరెడ్డి ప్రభాకర్ రెడ్డి, సిద్ధాల భరత్, వాకర్స్, చుట్టు ప్రక్కల కాలనీ వాసులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కామేష్ రెడ్డి మాట్లాడుతూ.. అధికారులు అలసత్వంతో, సమన్వయలోపంతో మొద్దు నిద్ర పోతూ ప్రజల నుండి వసూలు చేస్తున్న అధిక ఇంటి పన్నులను ఎలాంటి జవాబుదారీతనం లేకుండా ప్రజలకు కలుగుతున్న ఇబ్బందిని ప్రశ్నించగా.. మాకేం పట్టనట్టుగా అధికారుల తీరు ఉందన్నారు. అక్కడ జేసీబీ పైన పని చేసేటువంటి వారిని ప్రశ్నించగా గత 20 రోజుల నుండి ఇక్కడ ఎలాంటి పనులు చేయటం లేదని వారు తెలిపారన్నారు. ఒక వారం రోజులలో ఇక్కడ ఉన్నటువంటి గుర్రపు డెక్కను తొలగించకపోతే చెరువు బయట రోడ్డు పైన బైఠాయించి 1000 మంది వాకర్స్ తో ధర్నా చేస్తామని హెచ్చరించారు. అధికారుల మొద్దు నిద్రతోనా.. లేక ప్రభుత్వ వైఫల్యంతోనో అర్థం కావడం లేదని, కానీ సర్వాంగ సుందరంగా ఉన్న చెరువును డంపింగ్ యార్డ్ లాగా తయారు చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారుల వైఖరి ఇలానే ఉన్నట్లయితే తరువాత చర్యలు ఇంకా తీవ్ర స్థాయిలో ఉంటాయని, దీన్ని ఉద్యమంలాగా ముందుకు తీసుకెళ్తామని హెచ్చరించారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!