మన తొలివెలుగు , మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య ముదిరాజ్ :
ప్రజాస్వామ్యానికి ఓటు హక్కే మూల స్తంభమని, 18 ఏళ్లు నిండిన యువతీ, యువకులు విధిగా ఓటరుగా నమోదు చేసుకోవాలని మాజీ కౌన్సిలర్ పందెం కొండల్ యాదవ్ సూచించారు. జల్ పల్లి 64 సర్కిల్ పరిధిలోని అభిషేర్, మహమ్మద్, అలీ, అజీమ్ కాలనీలలో బీఎల్ ఏలతో కలిసి ఇంటింటికి తిరిగి ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ లో భాగంగా ఎన్యూమరేషన్ పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కొండల్ యాదవ్ మాట్లాడుతూ ఎస్ఐఆర్ పట్ల ఓటర్లు, కాంగ్రెస్ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా ఓటు గల్లంతయ్యే ప్రమాదం ఉందని తెలిపారు. డివిజన్ పరిధిలోని ఓటర్లందరూ ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో బి ఎల్ వోలు నరేందర్, ఫర్హీన్, షబానా, నాయకులు వినోద్, హాబీస్ తదితరులు పాల్గొన్నారు.

