ePaper
Friday, September 18, 2026
📄 ePaper
Homeమహేశ్వరంమర్యాదపూర్వకంగా హరీష్ రావు పైలట్ రోహిత్ రెడ్డిని కలిసిన బీఆర్ఎస్ నేతలు సిద్దు, ప్రవీణ్ 

మర్యాదపూర్వకంగా హరీష్ రావు పైలట్ రోహిత్ రెడ్డిని కలిసిన బీఆర్ఎస్ నేతలు సిద్దు, ప్రవీణ్ 

📰 Generate e-Paper Clip

మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య ముదిరాజ్ :

తెలంగాణ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు ఈ నెల 3న జన్మదినం జరుపుకున్న సందర్భంగా, 7న మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి జన్మదినం సందర్భంగా వారిద్దరూ నిండు నూరేళ్లు ఆయురా రోగ్యాలతో ఉండాలని జల్ పల్లి డివిజన్ పరిధిలోని శ్రీరామ కాలనీకి చెందిన బీఆర్ఎస్ నేతలు సిద్దు, ప్రవీణ్ జూబ్లీహిల్స్ పెద్దమ్మ ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

అనంతరం ఆదివారం హరీష్ రావుని కలిసి సన్మానించి పూలబోకే అందజేసి వేద బ్రాహ్మణులతో పూజ చేయించిన కంకణం చేతికి కట్టారు. కుంకుమ పెట్టారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన చేతికి కంకణం కట్టారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు ప్రదీప్, ఉపేందర్, పవన్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!