ePaper
Thursday, August 6, 2026
📄 ePaper
Homeచాంద్రాయణ గుట్టలాల్ దర్వాజా వీధులన్నీ చెత్త.. చెత్త..!

లాల్ దర్వాజా వీధులన్నీ చెత్త.. చెత్త..!

📰 Generate e-Paper Clip

లాల్ దర్వాజా వీధులన్నీ చెత్త.. చెత్త..!

ప్రధాన రోడ్ పై రోజుల తరబడి పేరుకుపోయిన టన్నులకొద్ది చెత్త

అధికారుల ఏం చేస్తున్నట్టు.. గుడ్డి గాడిద పళ్ళు తోముతున్నారా..? 

స్థానిక ప్రజల ఆగ్రహం

మన తొలివెలుగు, చాంద్రాయణగుట్ట ప్రతినిధి శైలేష్ కుమార్

పాతబస్తీ లాల్ దర్వాజా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం సమీపంలో ప్రధాన రోడ్డుపై గత కొన్ని రోజులుగా చెత్త తొలగించకపోవడంతో భారీగా చెత్త కుప్పలుగా పేరుకుపోయింది. ప్లాస్టిక్, కుళ్లిన ఆహార వ్యర్థాలు, వైద్య వ్యర్థాల నుండి వెలువడుతున్న దుర్వాసనతో పాదచారులు నడవడం కష్టంగా మారింది. దోమల బెడద పెరిగి డెంగ్యూ, మలేరియా. వైరల్ ఇన్ఫెక్షన్స్ సోకుతాయని స్థానికులు భయపడుతున్నారు.

స్కూల్ పిల్లలు, వృద్ధులు, రోడ్డుపై నడవడానికి భయపడుతున్నారు. శానిటేషన్ సూపర్వైజర్, సిబ్బందికి, అధికారులకు ఫోన్ చేసి చెప్పినా ఎవరూ పట్టించుకోవడంలేదని వర్షం వస్తే ఈ చెత్త అంతా ఇళ్లలోకి, డ్రైనేజీలోకి వెళ్లి ఇంకా సమస్య అవుతుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా జీహెచ్ఏంసీ, జోనల్ కమిషనర్ వెంటనే స్పందించి చెత్త తొలగింపు, రోజువారీ క్లీనింగ్, బ్లీచింగ్ పౌడర్ చల్లాలని ప్రతిరోజూ చెత్తని సేకరించే సరైన సిబ్బందిని ఏర్పాటు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!