ePaper
Wednesday, June 17, 2026
📄 ePaper
Homeయాదాద్రి భువనగిరి జిల్లామెపా జిల్లా ప్రధాన కార్యదర్శిగా పెద్దబోయిన రామకృష్ణ ముదిరాజ్

మెపా జిల్లా ప్రధాన కార్యదర్శిగా పెద్దబోయిన రామకృష్ణ ముదిరాజ్

📰 Generate e-Paper Clip

నియామక పత్రం అందజేసిన వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు పులి దేవేందర్ ముదిరాజ్

మన తొలివెలుగు, యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో ప్రతినిధి జంగిటి రవీందర్ 

ముదిరాజ్ ఎంప్లాయిస్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ (మెపా ) యాదాద్రి భువనగిరి జిల్లా ప్రధాన కార్యదర్శిగా పెద్దబోయిన రామకృష్ణ ముదిరాజ్ ను నియమిస్తూ అసోసియేషన్ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు పులి దేవేందర్ ముదిరాజ్ సోమవారం జిల్లా కేంద్రంలో నియామక పత్రం అందజేశారు. ఈ సందర్బంగా పులి దేవేందర్ ముదిరాజ్ మాట్లాడుతూ.. పోలీస్ హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వర్తిస్తున్న వలిగొండకు చెందిన రామకృష్ణ జాతి సేవకుడిగా ముందుకు రావడం అభినందనీయమన్నారు. ముదిరాజ్ జాతి బిడ్డలు హక్కుల కోసం ఐక్యంగా పోరాటం చేయాలని అన్నారు. అనంతరం రామకృష్ణ ముదిరాజ్ మాట్లాడుతూ.. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న ముదిరాజ్ బిడ్డలు ఒకరికొకరు సహకారం అందించుకోవాలని అన్నారు. నా వంతు సేవ చేయాలనే ఆలోచనతో మెపాలో చేరినట్టు చెప్పారు. ముదిరాజ్ ఎంప్లాయిస్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ యాదాద్రి జిల్లా ప్రధాన కార్యదర్శిగా అవకాశం కల్పించిన రాష్ట్ర అధ్యక్షులు పులి దేవేందర్ ముదిరాజ్, రాష్ట్ర కార్యదర్శి దాసరి వీరన్న ముదిరాజ్, జిల్లా అధ్యక్షులు గుర్రాల బాలకృష్ణ ముదిరాజ్ తదితరులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు గంగరబోయిన కిరణ్ ముదిరాజ్ లతో పాటు యాదాద్రి జిల్లా మెపా నాయకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!