రాజీవ్ గాంధీ జీవిత చరిత్ర పుస్తకాన్ని బహూకరించిన ప్రమోద్ కుమార్
మన తొలివెలుగు | యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి | జంగిటి రవీందర్ | అక్టోబర్ 17, 2026 :
భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డిని పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అబ్జర్వర్ పోత్నక్ ప్రమోద్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. శనివారం గచ్చిబౌలిలోని ఎంపీ నివాసంలో జరిగిన ఈ భేటీలో భాగంగా, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి అత్యంత సన్నిహితుడైన డీపీ రాయ్ రచించిన రాజీవ్ గాంధీ జీవిత చరిత్ర పుస్తకాన్ని ప్రమోద్ కుమార్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డికి బహూకరించారు.
ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ జీవిత విశేషాలను ప్రతిబింబించే పుస్తకాన్ని ఎంపీకి అందజేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమంలో రాచమల్ల రమేష్, చామల యువసేన సభ్యుడు మహమ్మద్ అతహర్ నిహాల్ తదితరులు పాల్గొన్నారు.

