ePaper
Saturday, August 1, 2026
📄 ePaper
Homeమహేశ్వరంచిన్నారులకు రెండు చుక్కలు రక్షణ కవచంలా పనిచేస్తాయి

చిన్నారులకు రెండు చుక్కలు రక్షణ కవచంలా పనిచేస్తాయి

📰 Generate e-Paper Clip

మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య ముదిరాజ్

 చిన్నారులకు రెండు పోలియో చుక్కలు రక్షణ కవచంలా పనిచేస్తాయని మాజీ కౌన్సిలర్ లక్ష్మీనారాయణ తెలిపారు. శ్రీరామ కాలనీ ప్రభుత్వ దవాఖానలో ఆయన చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి తల్లిదండ్రులు తమ తమ 5 ఏళ్ల లోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించాలని కోరారు. పిల్లల నిండు జీవితానికి ఈ రెండు చుక్కలు రక్షణ కవచంలా పనిచేస్తాయని కోరారు. ఒక్క చిన్నారి కూడా మిగిలిపోకుండా చూడటమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. తల్లిదండ్రులు ఎలాంటి అపోహలు పెట్టుకోకుండా తమ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం బాధ్యతగా పోలియో చుక్కలు వేయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైద్యురాలు ప్రియాంక, అంగన్వాడి టీచర్ సరస్వతి, ఆశా సిబ్బంది విజయ, కల్పన, మౌలానా పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!