ePaper
Saturday, August 1, 2026
📄 ePaper
Homeమహేశ్వరంఇబ్రహం అంజయ్యకు ఉద్యోగ విరమణ శుభాకాంక్షలు

ఇబ్రహం అంజయ్యకు ఉద్యోగ విరమణ శుభాకాంక్షలు

📰 Generate e-Paper Clip

మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య ముదిరాజ్  :

జీహెచ్ఎంసీ పరిధిలోని బాలాపూర్ లో నివాసం ఉంటూ స్థానిక బీడీఎల్ లో పనిచేస్తూ ఉద్యోగ విరమణ పొందిన స్థానిక వాసి ఇబ్రహం అంజయ్యని సత్కరించి అభినందించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ వైస్ చైర్మన్ చిగిరింత నరసింహారెడ్డి, మాజీ కార్పొరేటర్ వంగేటి ప్రభాకర్ రెడ్డి, నాయకులు బలింగని జంగయ్య, గిరికటి కృష్ణంరాజు గౌడ్, కొప్పుల రాజు, నిరుడు శ్రీరాములు, పగడాల ఉమేష్, తూళ్ల నరహరి గౌడ్, సంరెడ్డి మహిపాల్ రెడ్డి తదితరులు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆయన సంస్థకు అందించిన సేవలు ఎల్లప్పుడూ గుర్తుంటాయని అన్నారు. తమ అంకితభావంతో, క్రమ శిక్షణతో సుదీర్ఘకాలం పాటు ఎనలేని సేవలు అందించిన తమ ఆత్మీయులు ఇబ్రమ్ అంజయ్య కి ఉద్యోగ విరమణ శుభాకాంక్షలు తెలిపారు. ఉద్యోగ విరమణ పొందుతున్న ఈ శుభదినం సందర్భంగా మీ శ్రమను, సేవలను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నామన్నారు. తను పదవీ విరమణ అనంతరం జీవితాన్ని శేష జీవితం ఆరోగ్యంగా, కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపాలని ఆకాంక్షించారు. ఆయురారోగ్యాలతో, కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపాలని కోరుకున్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!